https://oktelugu.com/

Allu Arjun – Sneha : అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి కోపం వస్తే బెడ్ రూమ్ లోకి వెళ్లి అలా చేస్తుందట..!

మరి ఇలాంటి మనుషులు ఉంటున్న కాలంలో స్నేహాలత తన కోపాన్ని ఎవరి మీద చూపించకుండా మెడిటేషన్ చేస్తూ కోపాన్ని తగ్గించుకుంటుందంటే నిజంగా అది అల్లు అర్జున్ గారి అదృష్టమనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 13, 2023 / 08:34 PM IST
    Follow us on

    Allu Arjun – Sneha : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ ని అందుకుని ఇండస్ట్రీ లో ఐకాన్ స్టార్ గా ఎదిగాడు.ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

    అయితే అల్లు అర్జున్ స్నేహాలత రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీళ్ళ ప్రేమ కి గుర్తుగా ఇప్పుడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు…ఇక స్నేహాలత రెడ్డి తన పర్సనల్ విషయాలని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. దానివల్ల ఆమె జీవితంలో జరిగే అప్డేట్స్ అన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. ఇక వీళ్ల పిల్లల గురించి కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు.ఇప్పటికే వీళ్ళ కూతురు అయిన అర్హ గుణశేఖర్ డైరెక్షన్ లో సమంత హీరోయిన్ గా వచ్చిన శాకుంతలం సినిమాలో కూడా నటించి అందరి చేత ప్రశంసలను అందుకుంది. ఇక స్నేహలత రెడ్డి ఇంట్లోనే ఉంటూ పిల్లల బాగోగులు చూసుకుంటూ వాళ్లకు సంబంధించిన అన్ని వ్యవహారాలను కూడా తనే దగ్గరుండి చూసుకుంటుంది.అల్లు అర్జున్ ఎప్పుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటాడు కాబట్టి స్నేహలత రెడ్డి పిల్లలకి కావాల్సినవన్నీ చూసుకుంటుంది.

    వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలి కల్చరల్ ఆక్టివిటీస్ కి సంభందించిన అన్ని విభాగాల్లో కూడా వాళ్ళకి శిక్షణ ఇప్పించడానికి ఆమె ఎప్పుడూ ముందు ఉంటుంది.అలాగే పిల్లల్ని హైపర్ ఆక్టివ్ గా తయారు చేయడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటుంది.అలా పిల్లల బాగోగులు చూసుకుంటూనే తనకు తీరిక దొరికిన సమయాల్లో సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో గాని,ఫ్యాన్స్ తో గానీ తనకి సంభందించిన విషయాలను గానీ షేర్ చేసుకుంటూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది.

    ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ స్నేహలత రెడ్డి అల్లు అర్జున్ భార్యగా దొరకడం అల్లు అర్జున్ అదృష్టం అని చాలామంది అంటున్నారు.ఎందుకు అని అనుకుంటున్నారా అందరికీ కోపం వస్తే కసురుకోడం,లేదా పిల్లల్ని కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ స్నేహాలత మాత్రం ఏదైనా విషయంలో హర్ట్ అయితే ఆమె ఎవరి మీద అరవకుందా సైలెంట్ గా ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయి బెడ్ మీద కూర్చొని యోగా చేస్తూ తనకొచ్చిన స్ట్రెస్ ని పోగొట్టుకుంటూ దాన్ని తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇక ఇలాంటి భార్య దొరకడం ప్రతి భర్తకి అదృష్టమే కదా అంటూ చాలామంది అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు…

    ఈరోజుల్లో ప్రతి దానికి ప్రతి భర్తని, ప్రతి భార్య నిందిస్తూనే ఉంటుంది. ఏ గొడవ వచ్చిన కూడా భర్త మీద అరుస్తుంది.పిల్లలు సరిగా చదవకపోయిన,పిల్లలు అల్లరి చేసిన కూడా అన్ని మీ నాన్న పోలికలే అంటూ వాళ్ళను కొడుతూ భర్త మీద అరుస్తూ ఉంటారు. మరి ఇలాంటి మనుషులు ఉంటున్న కాలంలో స్నేహాలత తన కోపాన్ని ఎవరి మీద చూపించకుండా మెడిటేషన్ చేస్తూ కోపాన్ని తగ్గించుకుంటుందంటే నిజంగా అది అల్లు అర్జున్ గారి అదృష్టమనే చెప్పాలి…