Chiranjeevi Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సంక్రాంతి కానుకగా విడుదలై, విజేతగా నిలిచి ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లతో ముందుకు పోతోంది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ లో చిరంజీవి కి ఎంత దక్కుతుందో, అనిల్ రావిపూడి కి కూడా అంతే సక్సెస్ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ఎన్నో సినిమాలు చేసాడు. ఒక్క డైరెక్టర్ కూడా ఆయనలోని వింటేజ్ కామెడీ టైమింగ్, వింటేజ్ సెంటిమెంట్ యాంగిల్ ని బయటకు తీయలేకపోయారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో చిరంజీవి లోని ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ ని బయటకు రాబట్టాడు. అందుకే ఈ రేంజ్ సక్సెస్ వచ్చింది. మెగా అభిమానులు సంబరాలు చేసుకునేలా చేసింది.
ఇదంతా పక్కన పెడితే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ముందే రావాల్సింది అట. ఆయనకు ఒక కథ ని వినిపించానని, అది ఆయనకు చాలా బాగా నచ్చిందని, కానీ సంక్రాంతికి వస్తున్నాం కి కమిట్మెంట్ ఇచ్చేయడం తో చిరంజీవి గారి దగ్గరకు వెళ్లి రిక్వెస్ట్ చేసుకుంటే, సరే వెళ్ళు, తర్వాత చేద్దామని అన్నదంటూ చెప్పుకొచ్చాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల తర్వాత చిరంజీవి గారి దగ్గరకు వెళ్తే, ఆయన పాతవి మనసులో ఏది పెట్టుకోకుండా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ స్టోరీ ని విన్నాడని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ముందు చిరంజీవి కి చెప్పిన స్టోరీ ఏంటి?, అది ‘మన శంకర వరప్రసాద్ గారు’ స్టోరీ యేనా?, లేదంటే వేరే స్టోరీ ని వినిపించాడా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ రెండు డిఫరెంట్ అయితే భవిష్యత్తులో చిరంజీవి కి మొదట వినిపించిన స్టోరీ తో అనిల్ రావిపూడి సినిమా చేసే అవకాశం ఉంటుందేమో చూడాలి.
ఇకపోతే ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి 16 వ రోజున కూడా తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావడం గమనార్హం. ఈ మధ్య కాలం లో ఏ సూపర్ హిట్ సినిమాకు కూడా ఈ రేంజ్ షేర్ వసూళ్లు రాలేదు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 172 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 282 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదే తరహా డీసెంట్ హోల్డ్ ని కొనసాగిస్తూ వెళ్తే మాత్రం కచ్చితంగా ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.