Salaar: భారీ పాన్ ఇండియా మూవీ అంటే హీరోపై చాలా భారమే ఉంటుంది. సినిమా పూర్తి చేయడానికి మించి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడాలి. రాష్ట్రాలు తిరిగి వివిధ బాషల మీడియా ప్రతినిధులతో ముచ్చటించాలి. సలార్ హీరో ప్రభాస్ మాత్రం కూల్ గా ఇంట్లో ఉండిపోయాడు. అడపాదడపా ప్రమోషన్స్ తప్పితే సీరియస్ గా చేసింది లేదు. దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవడానికి లేదు. ప్రభాస్ ఇటీవల మోకాలి సర్జరీ చేయించుకున్నారు. నెల రోజులపాటు విదేశాల్లో రెస్ట్ తీసుకున్నారు. ఆయన విరివిగా ప్రొమోషన్స్ లో పాల్గొనకపోవడానికి ఇది కూడా కారణం కావచ్చు.
అయితే సలార్ విడుదలకు రెండు రోజులు ముందు భారీ ప్లాన్ వేశారు. ఇండియాస్ ఎన్ డైరెక్టర్ రాజమౌళితో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. సలార్ టీమ్ ని ఆయన స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ వీడియో నేడు విడుదల చేశారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. రాజమౌళి ప్రశ్నలు ప్రశాంత్ నీల్ సమాధానాలు ఆసక్తికరంగా సాగాయి. సలార్ మేకింగ్, ఐడియాలజీ, టెంప్లెట్ తో పాటు అనేక విషయాలు చర్చకు వచ్చాయి.
సలార్ పార్ట్ 2 గురించి ప్రశాంత్ నీల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే పార్ట్ 1 ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం చెప్పలేను అన్నారు. దానికి కారణం… బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వాలని ట్రై చేస్తాను. అందుకు ఇంత సమయం పట్టిందని చెప్పలేను అన్నారు. రాజమౌళి ఎంట్రీతో సలార్ చిత్రానికి భారీ ప్రచారం దక్కింది. సోషల్ మీడియాలో స్టార్స్ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది.
సలార్ మూవీ ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. సలార్ ఇద్దరు మిత్రుల కథ. ప్రభాస్-పృథ్విరాజ్ ప్రాణ మిత్రులుగా కనిపించనున్నారు. ఫ్రెండ్ కోసం ఎంతకైనా తెగించేవాడిగా ప్రభాస్ పాత్ర ఉంటుంది. కెజిఎఫ్ మాదిరి ఖాన్సార్ అనే ఒక కల్పిత ప్రాంతాన్ని ప్రశాంత్ నీల్ సృష్టించాడు. దానిపై ఆధిపత్యం కోసం జరిగే యుద్ధంలో ప్రభాస్ పాత్ర ఏంటనేది ఆసక్తికరం. పార్ట్ 1లో మిత్రులుగా ఉండే ప్రభాస్, పృథ్విరాజ్ పార్ట్ 2లో శత్రువులుగా కనిపిస్తారట. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ సలార్ విడుదల చేస్తున్నారు.
https://youtu.be/vDVLI-s-85I?si=TrmVwIzzetM4lWTO