Rajini-Chiru-Balayya: చాలామంది దర్శక నిర్మాతలు సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడానికి ఒక సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ని సెట్ చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడున్న చాలామంది యంగ్ డైరెక్టర్స్ వండర్స్ ని క్రియేట్ చేస్తుంటే సీనియర్ దర్శకులు సైతం వాళ్ల బాటలోనే నడుస్తూ సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి,రజినీకాంత్, బాలయ్య బాబు కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది. కానీ అది అనుకోని కారణాల వల్ల ఆగిపోయిందనే విషయం మనలో చాలా మందికి తెలియదు.
అయితే ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా పట్టాలెక్కకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మణిరత్నం కథ విషయంలో ముగ్గురు హీరోలను సాటిస్ఫై చేసే విధంగా కథని డెవలప్ చేయలేకపోవడమే దానికి ముఖ్య కారణం అంటూ చాలా వార్తలైతే వచ్చాయి. ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా మిస్ అవ్వడమే కాకుండా, ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఈ విషయం లో వాళ్ల ఫ్యాన్స్ ని కూడా తీవ్రమైన నిరాశకు గురిచేశారు. ఇక ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఎక్కడ కూడా సినియర్ హీరోలని అనిపించుకోకుండా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక గత సంవత్సరం బాలయ్య బాబు చిరంజీవి ఇద్దరు కూడా రెండు సినిమాలను రిలీజ్ చేసి వాళ్ళు సినిమాలను ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో ఈ జనరేషన్ హీరోలు చూసి నేర్చుకోవాలనే విధంగా వాళ్లకి ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ఇక రజనీకాంత్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా తనదైన రీతిలో వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇక్కడ మన హీరోలకి ఎలాంటి క్రేజ్ అయితే ఉందో రజనీకాంత్ కి కూడా అలాంటి క్రేజ్ ఉండడం విశేషం… ప్రస్తుతం ఈయన ‘వెట్టయన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన వర్క్ లోనే తను పూర్తి బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…