Trivikram: అప్పటి త్రివిక్రమ్ స్థాయి వేరు, ఆయన స్థానం వేరు…మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

ఒకప్పుడు ఈయన పెన్ను నుంచి ఒక మాట బయటికి వచ్చిందంటే అదొక పదునైన మాటగా జనాల్లోకి చొచ్చుకొని పోయేది, ఇక ఇప్పటికీ ఆయన రాసిన మాటలు అందరికీ గుర్తున్నాయి అంటే, జనాల మీద ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

Written By: Gopi, Updated On : February 17, 2024 10:32 am
Follow us on

Trivikram: ఒకప్పుడు హీరోలని చూసి సినిమాలకి వెళ్లేవారు, కానీ ఫస్ట్ టైం హీరోలతో పని లేకుండా కథ, మాటలను బేస్ చేసుకుని కూడా సినిమాలు సక్సెస్ అవుతాయి అని నిరూపించిన ఒకే ఒక్కడు త్రివిక్రమ్. ఈయన చేసిన స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వే కావాలి, నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.

అయితే ఒకప్పుడు ఈయన పెన్ను నుంచి ఒక మాట బయటికి వచ్చిందంటే అదొక పదునైన మాటగా జనాల్లోకి చొచ్చుకొని పోయేది, ఇక ఇప్పటికీ ఆయన రాసిన మాటలు అందరికీ గుర్తున్నాయి అంటే, జనాల మీద ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అందులో ముగ్గురు త్రివిక్రమ్ గురించి ఆయన రాసిన మాటలు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ రేంజ్ లో త్రివిక్రమ్ జనాలను మాయ చేశాడు. ఇక నువ్వే నువ్వే సినిమాలో సునీల్, ఎమ్మెస్ నారాయణ కి మధ్య ఉండే కామెడి ట్రాక్ ని ఆయన రాసిన విధానం గాని, దాన్ని స్క్రీన్ మీద డెలివరీ చేసిన పద్దతి గానీ, ప్రతి ప్రేక్షకుడిని బాగా ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి.

ఇక ఇప్పటికీ ఆ సీన్ లో ఉన్న డైలాగులు అన్ని ప్రేక్షకులకు గుర్తున్నాయి.ఆ సీన్ కనక మనం ఇప్పుడు టీవీలో చూసినట్టయితే ఆ క్యారెక్టర్లు చెప్పే డైలాగ్ లు అన్నింటినీ సినిమా చూస్తున్న జనాలు అలవోక గా చెప్పేస్తుంటారు. ఇక అలాంటి దమ్మున్న రైటర్ ఇప్పుడు కొంతవరకు వెనకబడ్డాడనే చెప్పాలి.ఇక రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ స్టాండర్డ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం విపరీతంగా ఎదురుచూస్తూ ఉండేవారు.

కానీ ఇప్పుడు త్రివిక్రమ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఎలాంటి రొటీన్ రొట్ట కథ తో వస్తాడో అనే భయం లో సగటు ప్రేక్షకులతో పాటు ఆయన అభిమానులు కూడా భయపడుతున్నారు…మరి ఇప్పటికైనా గురూజీ నయా ట్రెండ్ ను ఫాలో అవుతూ మంచి స్టోరీలతో వచ్చి సక్సెస్ కొట్టాలని కోరుకుందాం…