https://oktelugu.com/

రెండేళ్ల పాటు దూరం: ఎస్పీ బాలు, కృష్ణ మధ్య ఏం గొడవ..?

అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎస్పీ బాలుకి.. ఎంతో ప్రోత్సాహం అందించిన సూపర్‌‌స్టార్‌‌ కృష్ణ మధ్య ఎందుకు గొడవ జరిగింది..? ఎలాంటి పరిస్థితులు ఈ గొడవకు దారితీశాయి..? Also Read: బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి అనుష్క..? బాలు పరిశ్రమలోకి ప్రవేశించిన కొత్తలో ఆయన్ను కృష్ణ ప్రోత్సహించినట్లుగా మరెవ్వరూ సపోర్టు ఇవ్వలేదు. ఘంటసాల శకం చివరిదశకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌‌, ఏఎన్‌ఆర్‌‌ తదితరులు కొత్తగా వచ్చిన రామకృష్ణకు తమవంతు సహకారం ఇచ్చారు. కానీ.. బాలుకు అవకాశాలు రాలేదు. ఆ సమయంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2020 / 09:29 AM IST

    sp balu krishan

    Follow us on


    అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎస్పీ బాలుకి.. ఎంతో ప్రోత్సాహం అందించిన సూపర్‌‌స్టార్‌‌ కృష్ణ మధ్య ఎందుకు గొడవ జరిగింది..? ఎలాంటి పరిస్థితులు ఈ గొడవకు దారితీశాయి..?

    Also Read: బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి అనుష్క..?

    బాలు పరిశ్రమలోకి ప్రవేశించిన కొత్తలో ఆయన్ను కృష్ణ ప్రోత్సహించినట్లుగా మరెవ్వరూ సపోర్టు ఇవ్వలేదు. ఘంటసాల శకం చివరిదశకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌‌, ఏఎన్‌ఆర్‌‌ తదితరులు కొత్తగా వచ్చిన రామకృష్ణకు తమవంతు సహకారం ఇచ్చారు. కానీ.. బాలుకు అవకాశాలు రాలేదు. ఆ సమయంలో బాలుకు అండగా నిలిచింది కృష్ణనే.

    ‘సినిమాలు తగ్గాయని బాధ పడవద్దు. నేను ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తే.. అన్నింటిలోనూ మీరు పాడుతారు’ అంటూ అభయం ఇచ్చారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌ ఏళ్ల పాటు సాగింది. కృష్ణకు బాలు ఎన్నో హిట్‌ సాంగ్స్‌ కూడా అందించారు. అయితే.. అంత దృఢంగా ఉన్న వీరి మధ్య ఓసారి చిన్న గొడవ మొదలైంది.

    ఓ నిర్మాత (ఆయన పేరును ఇప్పటికీ వీరద్దరూ ఎప్పుడూ చెప్పలేదు), కృష్ణతో సినిమా తీస్తున్న సందర్భంలో పాటల కోసం బాలుకు ఇవ్వాల్సిన పారితోషికంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాత కృష్ణకు చెప్పాడు. దీంతో కృష్ణకు కోపం వచ్చింది.బాలును పిలిపించి ‘మీరు పాడకుంటే నా సినిమాలు హిట్‌ కావా..?’ అని ప్రశ్నించాడు. ‘మీకు పాడకపోయినా నేను బతకగలనని’ బాలు సమాధానం ఇచ్చారు.

    Also Read: తమిళుల ప్రేమ.. బాలు గారికి దక్కిన గౌరవం !

    ఈ ఘటన తర్వాత వీరిద్దరి మధ్య రెండేళ్లు మాటలు లేవు. కృష్ణ తన తదుపరి చిత్రాలకు రాజ్‌ సీతారాంతో పాడించారు. ఆ తర్వాత గేయ రచయిత వేటూరి, సంగీత దర్శకుడు రాజ్‌–కోటి చొరవ తీసుకున్నారు. మళ్లీ బాలు, కృష్ణను కలిపారు. తర్వాత మరెన్నో హిట్‌ పాటలను కృష్ణ కోసం ఆలపించారు బాలు.