Game changer and Pushpa 2 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆరేళ్ళ తర్వాత సోలో హీరో గా నటించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ‘వినయ విధేయ రామ’ తర్వాత ఆయన #RRR చిత్రం చేసాడు. ఆ తర్వాత తన తండ్రి చిరంజీవి తో కలిసి ‘ఆచార్య’ చేసాడు. ఆచార్య చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు ఆయన అభిమానులు తమ హీరో పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ స్టార్ అని నిరూపించుకునే సినిమా పడాలి అనుకుంటున్న సమయంలో ‘గేమ్ చేంజర్’ చిత్రం మొదలైంది. ఈ సినిమా పై ఆయన అభిమానులు భారీ ఆశలు పెంచుకున్నారు. శంకర్ లాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తుండడంతో మొదట్లో ఈ చిత్రం పై అంచనాలు ఇతర హీరోల అభిమానుల్లో కూడా భారీగానే ఉండేవి. కానీ శంకర్ దర్శకత్వం లో వచ్చిన రీసెంట్ చిత్రం ‘ఇండియన్ 2’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో, ‘గేమ్ చేంజర్’ చిత్రం పై అంచనాలు తగ్గాయి.
ఇప్పుడు ఈ చిత్రం పై వచ్చే ప్రతీ పైసా రామ్ చరణ్ పేరు మీదనే వస్తుందని ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు దుమ్ము లేచిపోయే రేంజ్ వసూళ్లు వస్తాయి. అందులో సందేహం లేదు. కానీ హిందీ లో ఆ స్థాయి వసూళ్లు వస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే హిందీ లో వసూళ్లు రావాలంటే చాలా పారామీటర్స్ ఉండాలి. ‘పుష్ప 2 ‘ చిత్రం ఆ రేంజ్ సంచలనం సృష్టించడానికి కారణం, అక్కడి ఆడియన్స్ పార్ట్ 1 విపరీతంగా నచ్చడం వల్లే. కేవలం అల్లు అర్జున్ సినిమాకి మాత్రమే కాదు, బాలీవుడ్ ఆడియన్స్ సీక్వెల్స్ కి చెవులు కోసేసుకుంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ గా వచ్చిన ‘స్త్రీ 2’ చిత్రానికి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి, అక్కడి ఆడియన్స్ సీక్వెల్స్ కి ఎలా ఎగబడతారు అనేది.
ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ‘పుష్ప 2’ కి ఉన్నట్టు సీక్వెల్ క్రేజ్ లేదు. ఎంత వసూళ్లు వచ్చినా రామ్ చరణ్ పేరు మీద మాత్రమే రావాలి. కానీ ఇద్దరు ఒకే రేంజ్ హీరోలు కాబట్టి ‘పుష్ప 2 ‘ హిందీ వసూళ్లతో ‘గేమ్ చేంజర్’ హిందీ వసూళ్లను పోల్చి చూస్తారు ట్రేడ్ పండితులు. ‘పుష్ప 2’ చిత్రానికి హిందీ లో మొదటి రోజు 72 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ప్రస్తుతం ఉన్న బజ్ ని బట్టీ చూస్తే 10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మొదటి రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయట. థియేట్రికల్ ట్రైలర్ సరైనది పడితే కచ్చితంగా 20 కోట్ల రూపాయిల నెట్ మార్కుని కూడా అందుకోవచ్చు. ఈ చిత్రానికి హిందీ వెర్షన్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 40 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రం హిందీ లో 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాలి. మరి ఈ సినిమాకి అంత సత్తా ఉందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.