బాక్సింగ్ కథలు తెలుగు సినిమాకి కొత్తేమి కాదు. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన కథలు చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం బాక్సింగ్ కథల ఉధృతి సినిమాల్లో కాస్త ఉధృతంగా ఉంది. ఉన్నట్టు ఉండి ఈ కథలకు డిమాండ్ ఎందుకు పెరిగిందో గాని, మొత్తానికి ఇప్పుడు యంగ్ హీరోలు బాక్సర్ అవతారాలు ఎత్తుతున్నారు. ముందుగా విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాకి వద్దాం.
విజయ్ కెరీర్ లోనే భారీ ఎత్తున ఈ సినిమాని ప్లాన్ చేశాడు పూరి. పైగా ఈ సినిమా కథ కోసం పూరి ఎక్కువ టైం తీసుకున్నాడు. అలాగే డైలాగ్స్ విషయంలో కూడా వేరే రైటర్స్ మీద డిపెండ్ అయ్యాడని టాక్. సో.. విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీసుకొస్తున్నాడు పూరి. అయితే, ఈ జోనర్ లో వస్తోన్న సినిమాలకు అంతగా ఆదరణ దక్కడం లేదు.
‘లైగర్, గని’ సినిమాలు కన్నా ముందే రీసెంట్ గా కొన్ని బాక్సింగ్ సినిమాలు విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఫరాన్ అక్తర్ – రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాల ‘తుఫాన్’ అమెజాన్ లో డైరెక్ట్ గా విడుదలై.. ఏవరేజ్ మూవీ అనిపించుకుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయి ఉంటే కచ్చితంగా ప్లాప్ అయి ఉండేది అనే వార్త బాగా వినిపిస్తోంది.
అలాగే తమిళ్ హీరో ఆర్య నటించిన ‘సార్‌పట్ట’ కూడా ఈ నెలలోనే విడుదల కాబోతుంది. ఆల్ రెడీ ఈ సినిమాకి బ్యాడ్ టాక్ ఉంది. మరి ఈ సినిమా కూడా ప్లాప్ అయితే, ఇక రెండూ ప్యూర్ బాక్సింగ్ సినిమాలు ప్లాప్ అయినట్టు. అదేవిధంగా వరుణ్ తేజ్ కూడా ఓ బాక్సింగ్ మూవీ ‘గని’లో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రీషూట్ ల మీద రీషూట్ లు చేసుకుంటుంది. కాబట్టి, ఈ సినిమా కచ్చితంగా ప్లాప్ అంటున్నారు.
మొత్తమ్మీద బాక్సింగ్ సినిమాల్లో కాస్త ఎక్కువ అంచనాలు ఉన్న సినిమా ‘లైగర్’ ఒక్కటే. మరి ప్రేక్షకుల్లో ‘బాక్సింగ్’ చిత్రాల పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో విజయ్ దేవరకొండకు బాక్సింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేదే మెయిన్ డౌట్. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్థితేంటో ?