Anchor Soumya Rao: జబర్దస్త్ యాంకర్ కావాలని చాలా మంది యాంకర్స్ కోరుకుంటారు. రష్మీ గౌతమ్, అనసూయలు అనుభవిస్తున్న వైభవమే దీనికి కారణం. ముక్కూ ముఖం తెలియని వారిద్దరినీ ఆ షో స్టార్స్ చేసింది. జనాల్లో లోతుగా పాతుకుపోయిన జబర్దస్త్ వేదికపై కనిపిస్తే ఆటోమేటిక్ గా ఫేమ్ వస్తుందని యాంకర్స్ నమ్ముతారు. జబర్దస్త్ షో యాంకర్స్ గా చేసిన అనసూయ, రష్మీ వారు కలలో కూడా ఊహించని రేంజ్ కి వెళ్లారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకునే రష్మీ హీరోయిన్ అయ్యింది జబర్దస్త్ షో వలనే. అలాగే అనసూయ జీవితం కూడా మారిపోయింది. కోట్లు సంపాదించే రేంజ్ కి వెళ్ళిపోయింది.

నటిగా బిజీ అయిన అనసూయ బెటర్మెంట్ చూసుకొని జబర్దస్త్ వదిలేసింది. జబర్దస్త్ కి కేటాయించిన కాల్షీట్స్ సినిమాలకు కేటాయిస్తే ఆమెకు అధికంగా ఆదాయం వస్తుంది. ఈ కారణంగానే అనసూయ జబర్దస్త్ షో వదిలేసినట్లు తెలుస్తుంది. అనసూయ జబర్దస్త్ మానేసినప్పటి నుండి ఆ పోస్ట్ కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు. రెమ్యునరేషన్ కొంచెం అటూ ఇటూ అయినా పర్లేదు, చేసేస్తాం అని హింట్ ఇస్తున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఉన్న రష్మీకి జబర్దస్త్ బాధ్యతలు కూడా అప్పజెప్పారు కానీ… కొత్త యాంకర్ ని తీసుకోలేదు.
ఎట్టకేలకు సౌమ్య రావు అనే కన్నడ సీరియల్ నటిని రంగంలోకి దించారు. ఈ గురువారం ఎపిసోడ్ నుండి సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్ గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. రష్మీ స్థానంలో సౌమ్య రావు యాంకర్ గా రావడంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. రష్మీనే కొనసాగిస్తే బెటర్ అని కొందరు అంటుండగా ఎట్టకేలకు జబర్దస్త్ లో కొత్త యాంకర్ ని చూసే అదృష్టం దక్కిందని మరికొందరు ఫీల్ అవుతున్నారు. కాగా ఈ కొత్త యాంకర్ రెమ్యూనరేషన్ ఎంత? రష్మీ, అనసూయల కంటే తక్కువా? ఎక్కువా? అనే సందేహాలు తెరపైకి వచ్చాయి.

అందుతున్న సమాచారం ప్రకారం సౌమ్య రావు రెమ్యూనరేషన్ ఎపిసోడ్ కి రూ. 1 లక్ష నుండి 1.5 లక్షల మధ్య ఫిక్స్ చేశారట. ఆమె పెర్ఫార్మన్స్, రేటింగ్ ఆధారంగా పెంచుతామని హామీ ఇచ్చారట. ఇది రష్మీ-అనసూయల రెమ్యూనరేషన్ కంటే తక్కువ అని తెలుస్తుంది. రష్మీ ఎపిసోడ్ కి రూ. 2 లక్షలు పైనే తీసుకుంటున్నారని సమాచారం. ఇక జబర్దస్త్ యాంకరింగ్ అనేది పెద్ద బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. షోలో యాంకర్ పాత్ర చాలా ఉంటుంది. ప్రేక్షకుల అంచనాలు చేరుకోవాలి. ఏమాత్రం తగ్గినా కామెంట్స్ తో ఏకిపారేస్తారు. ముఖ్యంగా రష్మీ, అనసూయలను మరిపించాల్సి ఉంటుంది.