Upasana Pregnancy: మెగా కోడలు ఉపాసన కొణిదెల మరో రెండు మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులు ఘనంగా సీమంత వేడుకలు నిర్వహించారు. దుబాయ్ లో ఒకసారి, హైదరాబాద్ లో మరోసారి ఉపాసనకు సీమంతం జరిగింది. మెగా వారసుడు కోసం అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కారణం… ఇది పదేళ్ల నిరీక్షణ. రామ్ చరణ్ తండ్రి కావాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఎట్టకేలకు వారి కల నెరవేరింది.
కాగా ఉపాసన ప్రెగ్నెన్సీపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. అంతర్జాతీయ వేదిక జీ 20 సదస్సు సాక్షిగా కొన్ని సీక్రెట్స్ బయటపెట్టాడు. రామ్ చరణ్ ఉపాసన ప్రెగ్నెన్సీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. నాకు యూరప్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు జపాన్ దేశాన్ని అమితంగా ఇష్టపడుతున్నాను. జపాన్ దేశం, అక్కడి ప్రజలు, సంస్కృతి నాకు ఎంతో ఇష్టం.
నా భార్య ఉపాసనకు ప్రస్తుతం ఏడో నెల. నాకు పుట్టబోయే బిడ్డకు జపాన్ దేశంతో సంబంధం ఉంది. అదేమిటంటే ఆ మ్యాజిక్ జరిగింది అక్కడే. అందుకు జపాన్ దేశం నాకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. గత ఏడాది ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. భారీ ఎత్తున ప్రొమోషన్స్ నిర్వహించారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సతీసమేతంగా జపాన్ వెళ్లడం జరిగింది. అక్కడ రెండు వారాలకు పైగా ఉన్నారు.
అప్పుడే ఉపాసన గర్భవతి అయ్యారని రామ్ చరణ్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇక ఉపాసనకు అమెరికాలో డెలివరీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఆమె ఖండించారు. ఇండియాలోని అపోలో హాస్పిటల్స్ నాకు డెలివరీ అవుతుందని ఉపాసన వెల్లడించారు. 2012లో రామ్ చరణ్- ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు వీరి ప్రేమకు అంగీకారం తెలిపారు. దాంతో ఘనంగా పెళ్లి జరిపారు.