Beggar And Bichagadu: ఒకప్పుడు మూడు నెలల్లోనే సినిమాలను చేసి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ఇండస్ట్రీలో అందరు అతన్ని డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ గా పిలుస్తూ ఉండేవారు. సినిమా స్టార్ట్ చేసిన రోజే రిలీజ్ డేట్ ని చెప్పే ఘట్స్ ఉన్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం…కానీ కొన్ని రోజుల నుంచి ఆయన గాడి తప్పాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. కారణమేదైనా కూడా ఆయన ఔట్ డేటెడ్ అయిపోయాడు అంటూ చాలామంది అతన్ని విమర్శిస్తున్నారు. అయినప్పటికి ఆయన ఎక్కడా కూడా తడబడకుండా, భయపడకుండా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు విజయ్ సేతుపతితో చేస్తున్న ‘బెగ్గర్’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి కన్నడలో విజయ్ అంటోని హీరోగా చేసిన ‘బిచ్చగాడు’ సినిమాకి మధ్య కనెక్షన్ ఉంది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో విజయ్ సేతుపతి సైతం బిచ్చగాడిలా నటిస్తున్నాడట…
ఆయన సినిమాలో అలా నటించడానికి దాని వెనకాల ఒక పెద్ద స్కాం ఉంటుందని వాళ్ళందరిని పట్టుకోడానికి అతను అలాంటి ఒక గెటప్ లో నటిస్తాడనేది తెలుస్తోంది. దాని వెనకాల చాలామంది రాజకీయ నాయకులు కూడా దాగి ఉంటారట. ఇక ఈ మూవీ ఇలా ఉండబోతోందని విజయ్ సేతుపతి సైతం గతంలో చెప్పడం విశేషం…
ఇక బిచ్చగాడు సినిమాలో విజయ్ అంటోని చేసిన క్యారెక్టర్ ని, విజయ్ సేతుపతి చేస్తున్నాడా? అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాతో పూరి జగన్నాథ్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం చాలా రోజులుగా ఆయన మీద ఉన్న విమర్శలన్నీ తొలిగిపోతాయి. ఇక స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాథ్ డై హార్ట్ అభిమానులు సైతం అతను ఒక్క సక్సెస్ ను సాధిస్తే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన అభిమానుల కోరికలు నెరవేర్చడానికైనా పూరి జగన్నాథ్ సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…