Rajendra Prasad And Senior NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలను తీసి తనకంటూ ప్రత్యేకత ను సంతరించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్. ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ రూట్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీకి రావాలి అనుకున్న మొదట్లో సీనియర్ ఎన్టీఆర్ గారిని తరుచుగా కలుస్తూ ఉండేవారంట. సీనియర్ ఎన్టీఆర్ వాళ్లకు దగ్గర చుట్టం అవడంతో తెలిసిన వాళ్ల ద్వారా అయన్ని కలిసి ఆయనతో ఎక్కువగా గడుపుతూ ఉండేవాడు.
ఇలాంటి క్రమంలో నేను కూడా నటుడు ని అవ్వాలి అనుకుంటున్నాను అని రాజేంద్రప్రసాద్ చెప్పడంతో అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ నటుడి గా నువ్వు ఇక్కడ రాణించాలి అంటే నీకంటూ ఒక సపరేట్ గుర్తింపు ఉండాలి. ఎలా అంటే నేను పౌరాణికాలు చేస్తాను, జానపద సినిమాలు, లవర్ బాయ్ క్యారెక్టర్లు చేయడానికి నాగేశ్వరరావు ఉన్నాడు. మాస్ సినిమాలు చేయడానికి కృష్ణ ఉన్నాడు.
ఫ్యామిలీ సినిమాలు చేయడానికి శోభన్ బాబు ఉన్నాడు ఇక వీళ్ళని దాటుకుని నువ్వు ఏం చేస్తే ఇక్కడ నిలబడగలుగుతావు అనేది ఆలోచించుకొని అది చేయడం కోసం ఎక్కువగా కష్టపడు అలా అయితేనే ఇండస్ట్రీ లో నిలవగలుగుతావు అని చెప్పడంతో ఆయన చెప్పిన దాని గురించి 2 రోజుల పాటు ఆలోచించిన రాజేంద్రప్రసాద్ ఎన్టీయార్ దగ్గరికి వెళ్లి నేను కామెడీ హీరోని అవుతాను అంటూ చెప్పడంతో ఎన్టీఆర్ కూడా ఆయన చెప్పిన దానికి ఆనందపడి ఇప్పటివరకు ఇండస్ట్రీ లో కామెడీ సినిమాలు చేసే హీరో ఎవరు లేరు కాబట్టి నీకు మంచి పేరు వస్తుంది ఆ రకంగా నువ్వు కష్టపడు అని చెప్పడంతో రాజేంద్రప్రసాద్ చాలా ఉత్సాహంగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు అనుకున్నట్టుగానే కామెడీ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.
నట కిరీటిగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకులందరికి తన నటనతో నవ్వులు పంచాడు. ఇక ఇప్పటికి కూడా ఓ కామెడీ క్యారెక్టర్ ఉందంటే దానికి రాజేంద్రప్రసాద్ అయితేనే సరిగ్గా సరిపోతాడని దర్శక నిర్మాతలు అతన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆయన చేసిన పాత సినిమాలు అయిన ఆ ఒక్కటి అడక్కు, మాయలోడు, అప్పుల అప్పారావు లాంటి సినిమాలు ఇప్పటికీ అందరికీ ఫేవరెట్ సినిమాలుగా గుర్తుండి పోతాయి. ఆ సినిమాలు ఎప్పుడొచ్చినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు…అలా సీనియర్ ఎన్టీయార్ సలహా తో ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీ లో నటుడి గా కొనసాగుతున్నారు…