https://oktelugu.com/

Guntur Kaaram: గుంటూరుకారం కాపీ సినిమానే.. అడ్డంగా దొరికేసిన త్రివిక్రమ్..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ కీర్తి కిరీటాలు అనే నవల నుంచి కాపీ చేశారు అంటూ ఇప్పటికే పలు రకాల వార్తలైతే వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చే ప్రతి సినిమా మీద కాపీ అంటూ చాలా వార్తలైతే వస్తాయి.

Written By:
  • Gopi
  • , Updated On : January 5, 2024 / 01:27 PM IST

    Guntur Kaaram

    Follow us on

    Guntur Kaaram: త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ కీర్తి కిరీటాలు అనే నవల నుంచి కాపీ చేశారు అంటూ ఇప్పటికే పలు రకాల వార్తలైతే వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చే ప్రతి సినిమా మీద కాపీ అంటూ చాలా వార్తలైతే వస్తాయి ఇంతకుముందు కూడా అజ్ఞాతవాసి సినిమా ని ఫ్రెంచ్ సినిమాకి కాపీ అంటూ వార్తలు వచ్చాయి.

    అలాగే అఆ సినిమా ని కూడా యద్దనపూడి సులోచన రాణి రాసిన మీనా అనే నవల నుంచి కాపీ చేసి ఈ అఆ అనే సినిమా చేశారంటూ అప్పట్లో పెద్దగా వార్తలు రావడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆ వార్తలపై స్పందించి నేను సులోచనరాణి గారిని అడిగే ఆమె నుంచే ఈ కథను తీసుకున్నాను అంటూ సమాధానం చెప్పడంతో ఆ గొడవ ముగిసిపోయింది. ఇక అలా వైకుంఠపురం లో సినిమా టైంలో కూడా ఆ సినిమాని ఇంటిగుట్టు అనే సినిమా నుంచి కాపీ చేశారు అంటూ కామెంట్లు అయితే వచ్చాయి దాని మీద కూడా త్రివిక్రమ్ స్పందించాడు.ఇక వీటన్నింటిని పక్కన పెడితే ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమాని కూడా కీర్తి కిరీటాలు అనే నవల నుంచి త్రివిక్రమ్ కాపీ చేసినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.

    మరి ఈ సినిమా రిలీజ్ కి ముందే ఇలాంటి వార్తలు రావడంతో ఈ సినిమా మీద కొంతమందికి నెగిటివ్ అభిప్రాయమైతే ఏర్పడుతుంది.ఒక్కసారి ఈ సినిమా చూస్తే గాని ఈ సినిమా ఆ నవల నుంచి కాపీ చేశారా లేదా అనే విషయం మీద క్లారిటీ రాదు. ఇక ఇంతకుముందు కూడా త్రివిక్రమ్ మీద ఇలాంటి కాపీ ఆరోపణలు రావడంతో త్రివిక్రమ్ ఈ సినిమాని కాపీ చేశాడు అంటూ కొంతమంది నమ్ముతున్నారు. అయితే ఇప్పుడనే కాదు త్రివిక్రమ్ మొదటి నుంచి కూడా మంచి కథా రచయిత అయితే కాదు, మంచి డైలాగ్ రైటర్ గా మాత్రమే గుర్తింపు పొందాడు.

    ఇక అందులో భాగంగానే తనకి కథలు దొరకకపోవడంతో పాత సినిమా కథల్ని ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సక్సెస్ కొడుతూ ఉంటాడు అనేది కూడా ఆయన మీద మొదటి నుంచి ఉన్న ఒక విమర్శ…ఇక మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఇది కాపీ నా లేదా అనే విషయం మీద క్లారిటీ రాదు…