https://oktelugu.com/

Prabhas Fauji: ప్రభాస్ ఫౌజీ కి సీతారామం కి మధ్య సంబంధం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే బాహుబలి సినిమాతో ఒకసారి పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది...

Written By: , Updated On : December 1, 2024 / 02:30 PM IST
Prabhas Fauji(3)

Prabhas Fauji(3)

Follow us on

Prabhas Fauji: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక హను రాఘవపూడి దుల్కర్ సల్మాన్ ను హీరోగా పెట్టి చేసిన సీతారామం సినిమా మంచి విజయాన్ని సాధించింది . ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హను రాఘవపూడి ప్రభాస్ తో చేస్తున్న సినిమా కూడా సీతారామం మాదిరిగానే వార్ నేపథ్యం లో ఉండడంతో ఈ రెండు సినిమాలకి మధ్య ఏదైనా సంబంధం ఉందా అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకోవాలని హను రాఘవపూడి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు చెబుతూ వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఈ సినిమాల మధ్య పోలికలైతే ఉన్నాయ్ అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో హీరో ఆర్మీ ఆఫీసర్ అవ్వడం ఒక్కటి మినహాయిస్తే మిగిలినది ఏది కూడా సేమ్ అయితే కాదని చాలా కాన్ఫిడెంట్ గా దర్శకుడు చెబుతున్నాడు. మరి ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని తొందర్లోనే రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక తొందర్లోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరగబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఫౌజీ సీతారామం రెండు సినిమాల మధ్య ఎంతో కొంత సంబంధం అయితే ఉండనుందనేది చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

మరి తనదైన రీతిలో ఈ సినిమా మీద దర్శకుడు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నాడు. తద్వారా ఈ సినిమాని ఎలాంటి సక్సెస్ ఫుల్ సినిమాగా నిలపబోతున్నాడనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే హను రాఘవపూడి చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.

కాబట్టి ఆయన డైరెక్షన్ లో నటించడానికి ప్రభాస్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాబట్టి ప్రభాస్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలంటే హను రాఘవపూడి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.