Balakrishna Sridevi: ‘నందమూరి తారక రామారావు’ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు గుర్తుండిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే అప్పట్లో తను ఇండస్ట్రీకి చేసిన సేవలు అలాంటివి. తన తర్వాత ఆయన నట వారసుడిగా వచ్చిన బాలయ్య బాబు సైతం 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని అతన్ని గొప్పగా పరిచయం చేసినవే కావడం విశేషం… ఇక్కడ బాలయ్య బాబు అప్పట్లో చాలామంది హీరోయిన్లతో మంచి సినిమాలను చేశాడు. అయినప్పటికి ఒక హీరోయిన్ తో మాత్రం ఆయన సినిమా చేయలేకపోయాడు. ఇంతకీ ఆమె ఎవరు అంటే అతిలోక సుందరి అయిన శ్రీదేవి కావడం విశేషం… శ్రీదేవితో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ముగ్గురు మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించారు. కానీ బాలయ్య మాత్రం సినిమా చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటూ అప్పట్లో కొన్ని కథనాలైతే వెలువడ్డాయి. నిజానికి బాలయ్య శ్రీదేవితో సినిమా చేయకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? అంటే అప్పటికే సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి తో చాలా సినిమాలు చేశాడు… దాంతో ఎన్టీఆర్ అలాగే తన కొడుకు ఇద్దరు ఒకే హీరోయిన్ తో సినిమా చేస్తున్నారు అంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తాయేమో అనే ఉద్దేశ్యంతోనే బాలయ్య శ్రీదేవితో ఒక్క సినిమా కూడా చేయలేదట.
కారణం ఏదైనా కూడా బాలయ్య బాబు అప్పట్లో శ్రీదేవితో సినిమా చేయకపోవడాన్ని అతని అభిమానులు కూడా తప్పబట్టారు. అప్పట్లో శ్రీదేవికి మంచి క్రేజ్ ఉండేది కాబట్టి బాలయ్య శ్రీదేవి తో సినిమా చేస్తే ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుందని అనుకున్నారు.
కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక నాగేశ్వరరావు తో శ్రీదేవి నటించింది. అలాగే నాగార్జునతో కూడా నటించింది. నాగార్జున తన తండ్రి తో చేసిన హీరోయిన్ తో మూవీ చేశాడు.మరి నాగార్జున కి లేని ఇబ్బంది బాలకృష్ణకు ఎందుకు వచ్చింది అంటూ పలువురు సినిమా విమర్శకులు సైతం అప్పట్లో కొన్ని విమర్శలను చేయడం విశేషం…
ఇక బాలయ్య ఇండస్ట్రీ కి వచ్చి 50 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. ఇక ఆయన మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడమే కాకుండా ఇప్పటికీ మాస్ సినిమాలతో రచ్చ చేస్తున్నారు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… ఇక ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాతో మరోసారి శివ తాండవం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు…