Salaar: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సలార్ సినిమా ఫీవర్ నడుస్తుంది. ఇప్పటికే 700 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో మాత్రం 800 కోట్లను దాటి కలక్షన్ల ను వసూలు చేస్తుంది. అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో గోడ్డుకారం వేసుకొని అన్నం తింటూ ఉంటాడు.అయితే ప్రభాస్ అలా ఎందుకు తింటాడు అనేదాన్ని ఉద్దేశించి ఒక యూట్యూబర్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.అది ఏంటి అంటే ఈ సినిమాలో చిన్న పిల్లలు బర్త్ డే జరుగుతున్నప్పుడు ప్రభాస్ కేక్ కొయ్యడానికి చాక్ పట్టుకుంటే వాళ్ళ అమ్మ ఆ చాకును చూసి భయపడుతుంది.
అది ప్లాస్టిక్ చాక్ అయినప్పటికీ దాన్ని చూసి బాగా భయపడుతూ ఇంకోసారి నువ్వు చాక్ ని ముట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళ అమ్మ చెబుతోంది. ఇక దీంతో ఇంట్లో కూర వండాలంటే వాటిని కట్ చేయడానికి కత్తి కానీ, కత్తిపీటలు కానీ వాడాల్సి ఉంటుంది. దాని వాళ్ల ప్రభాస్ ఆ కత్తి ని గానీ కత్తి పీట ని గానీ తీసుకొని మళ్ళీ ప్రళయం సృష్టిస్తాడెమో అనే ఉద్దేశ్యం తోనే వాళ్లు కూరలు వండుకోకుండా గొడ్డు కారంతో తింటున్నారు అంటూ ఒక యూట్యూబర్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అది చూసిన చాలామంది నవ్వుకుంటూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి ఇంత సిల్లీ కామెంట్లు ఎలా చేస్తారు బ్రో అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇంకొందరైతే ప్రశాంత్ నీల్ కూడా ఇలా ఆలోచించడేమో బ్రో నువ్వు చెప్పాక ఆ సీన్ లో అంత డెప్త్ ఉందా అంటూ ప్రశాంత్ నీల్ కూడా ఆశ్చర్య పోతాడు అంటూ అతని మీద విపరీతమైన కామెంట్లు అయితే చేస్తూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి దానికున్న బ్యాక్ స్టోరీ అది కాదు అయినప్పటికీ ఆయన చేసిన ఒక సిల్లి కామెంట్ చేయడం తో అది బాగా పాపులర్ అయింది…దీనికి సంభందించిన క్లారిటీ ని ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ లో ఇస్తాడేమో చూడాలి…
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే మంచి సక్సెస్ ని అందుకొని భారీ వసూళ్లను రాబడుతు 2023 వ సంవత్సరంలో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో అత్యంత భారీ కలక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో ప్రభాస్ మరొక భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు…