spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi on Bheemla Nayak: భీమ్లానాయ‌క్ ఇబ్బందుల‌పై చిరంజీవి మౌనం దేనికి కార‌ణం..?

Chiranjeevi on Bheemla Nayak: భీమ్లానాయ‌క్ ఇబ్బందుల‌పై చిరంజీవి మౌనం దేనికి కార‌ణం..?

Chiranjeevi on Bheemla Nayak: భీమ్లానాయ‌క్ మూవీ విష‌యంలో జ‌రుగుతున్న రాద్దాంతం అంతా ఇంతా కాదు. మొద‌టి నుంచి ఈ మూవీ మీద ఎన్నో వివాదాలు వ‌స్తూనే ఉన్నాయి. అయినా స‌రే వాట‌న్నింటినీ ప‌వ‌న్ లెక్క చేయ‌కుండా రిలీజ్ చేసి సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నారు. అయితే ఏపీలో మాత్రం ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

Chiranjeevi on Bheemla Nayak
Chiranjeevi on Bheemla Nayak

త‌గ్గించిన రేట్ల‌కే టికెట్లు అమ్మాల‌ని థియేటర్ల‌కు నోటీసులు ఇవ్వ‌డం, రెవెన్యూ ఉద్యోగులు త‌నిఖీలు చేయ‌డం, చెప్ప‌లేన‌న్ని ఆంక్ష‌లు విధించేయ‌డంతో చాలా చోట్ల థియేట‌ర్లు మూసుకుంటున్నారు. అయితే ఈ వివాదంపై నాగ‌బాబు స్పందిస్తూ.. ఒక హీరోను ఇంత‌లా ఇబ్బంది పెడుతున్నా ఇండ‌స్ట్రీ నుంచి స్పంద‌న క‌రువైందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే దీని మీద భిన్న‌మైన కామెంట్లు వ‌స్తున్నాయి. వాటిని చూస్తే మెగా బ్ర‌ద‌ర్‌కే షాక్ త‌ప్ప‌దేమో.

Also Read: TDP Bheemla Nayak: భీమ్లానాయ‌క్ అవకాశాన్ని వాడేస్తున్న టీడీపీ.. ఆ భ‌యంతో బీజేపీ కూడా..!

ఇండ‌స్ట్రీ పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించే చిరంజీవి భీమ్లానాయ‌క్ ఇబ్బందుల విష‌యంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి ఎలాంటి ఇబ్బంది వ‌చ్చినా ముందుంటాన‌ని చెప్పే చిరంజీవి మ‌రి సొంత త‌మ్ముడి సినిమా విష‌యంలో ఎందుకు సైలెంట్ అయ్యార‌ని ప్ర‌శ్నిస్తున్నారు సినీ జ‌నాలు. ఇది కూడా పెద్ద పాయింటే క‌దా. టికెట్ల రేట్ల వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు ముందుండి జ‌గ‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన చిరంజీవి.. ఇప్పుడు ఎందుకు ప్ర‌శ్నించ‌ట్లేద‌ని అంటున్నారు.

అంద‌రికంటే పెద్ద అయిన చిరంజీవి ముందుగా స్పందించ‌కుండా.. ఇండ‌స్ట్రీ స్పందించాల‌ని నాగ‌బాబు డిమాండ్ చేయ‌డ‌మేంట‌ని అంతా ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి మెగా బ్ర‌ద‌ర్‌కే ఎదురు ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ విష‌యంలో వైసీపీ కోపంగా ఉంద‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అందుకోసమే కావాల‌నే కొత్త జీవోను లేట్ చేస్తున్నార‌నే వాద‌న‌లు కూడా ఉన్నాయి. ఇన్ని తెలిసిన చిరంజీవి.. ఈ వివాదాన్ని పెద్ద‌ది చేయ‌డం ఎందుకు అనే మౌనంగా ఉంటున్నారా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. సినిమా ఎలా ఉంది అనే దానిపైనే స్పందించిన చిరు.. స‌మ‌స్య‌లను మాత్రం గాలికి వ‌దిలేయ‌డం మెగా ఫ్యాన్స్‌కు నిరాశ క‌లిగిస్తోంది.

Also Read: Bheemla Nayak: ఆంధ్రా నడిబొడ్డున జగన్ కు షాకిచ్చిన పవన్ ఫ్యాన్స్.. ‘థాంక్యూ సీఎం సార్’ వైరల్

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...
Oktelugu Epaper