Udaya Bhanu: బిగ్ బాస్ సీజన్ 6 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఆసక్తి తగ్గట్టుగానే బిగ్ బాస్ సీజన్ 6 మొత్తానికి చాలా ఆసక్తికరంగా మొదలైంది. పైగా, ఈ సీజన్ 6 విభిన్నమైన కంటెంట్ తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చింది. అయితే, ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవ్వరూ ఊహించని వారు ఎంట్రీ ఇచ్చారు. కానీ, వస్తారు అనుకున్న వాళ్ళు మాత్రం రాలేదు. వస్తారు అనుకున్న లిస్ట్ లో ఫేమస్ యాంకర్ ఉదయభాను కూడా ఉంది. ఉదయభాను హౌస్‌లో అడుగుపెట్టబోతుందని.. పైగా, అందరికంటే ఉదయభాను భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంది అని టాక్ నడిచింది.

కానీ, హౌస్ లోకి వచ్చిన ఫైనల్ లిస్ట్ లో ఆమె లేదు. ఈ విషయంలోనే ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. బిగ్ బాస్ షో అంటే.. పూర్తి డ్రామా. లోపల పగ, ద్వేషం రగులుతున్నా, పైకి మాత్రం నవ్వుతూ ప్రేమగా మాట్లాడాలి. ఉదయభాను ఏమో ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెప్పేసే స్వభావం ఉన్న వ్యక్తి. కాబట్టి.. తనకు ఈ షో సెట్ అవ్వకపోవచ్చు అని ఉదయభాను ఫీల్ అయిందట.
Also Read: Nayanthara: నయనతార పిల్లల్ని కంటే చనిపోతుంది.. కారణం అదే.. షాక్ అవుతున్న ఫ్యాన్స్ !
దీనికి తోడు హౌస్ లో ఏ కష్టం వచ్చినా సర్దుకుపోవాలని ఉదయభానుకు కండీషన్ పెట్టాడట బిగ్ బాస్. ముఖ్యంగా విన్నర్ అవ్వడం కోసం త్యాగాలు కూడా చేయాలని బిగ్ బాస్ ఉదయభానుని కోరాడట. ఈ మేరకు ఉదయభాను చేత అగ్రిమెంట్ కూడా రాయించుకునే ప్రయత్నం చేశారట. అయితే అన్నిటికి మించి ఉదయభాను తన కూతుర్లు ‘భూమి ఆరాధ్య, యువ నక్షత్రా’ లతో కలిసి హౌస్ లోకి రావాలని బిగ్ బాస్ కోరాడు.
ఈ సారి, బిగ్ బాస్ ‘హౌస్ లో’ మదర్ సెంటిమెంట్ ను హైలైట్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే ఉదయభాను తన ఇద్దరి కూతుర్లతో హౌస్ లోకి రావాలని, వారితో హౌస్ లో ఏ కష్టం వచ్చినా సర్దుకుపోవాలని కండీషన్ పెట్టాడు. ముఖ్యంగా కూతుర్లు కోసం లేనిపోని త్యాగాలు చేయకూడదు అని, అలాగే ఇంట్లో ఎలా ఉంటారో.. అలానే హౌస్ లోపల కూడా ఉండాలని.. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకూడదు అని’ బిగ్ బాస్ షరతులు పెట్టాడు.

ఇవన్నీ ఇష్టం లేని ఉదయభాను అందుకే బిగ్ బాస్ షోకి దూరంగా ఉంది. తన పిల్లలు పెద్ద వాళ్లు అయ్యారు కనుక, తాను బిగ్ బాస్ లో వాళ్ళ మధ్య ఇబ్బందిగా ఉండటం తనకు ఇష్టం లేదు అని.,. కాబట్టి షోకి రాలేను అంటూ ఉదయభాను తేల్చి చెప్పింది.


[…] […]