Star Heroes Movie Budgets: ప్రస్తుతం సినిమాలను చూడటానికి ప్రేక్షకులెవరు థియేటర్ కి రావడం లేదు. పండగ సీజన్ లో తప్ప మిగిలిన సమయాల్లో ఎవరు కూడా సినిమాలను పట్టించుకోకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడం…దానివల్ల సినిమా టికెట్ల రేట్లు కూడా పుష్కలంగా పెంచుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు టిక్కెట్ రేట్ ను నిర్ణయించుకోవడంతో సగటు ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాను చూసే అవకాశమైతే లేకుండా పోయింది. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన ఫ్యామిలీతో సినిమా థియేటర్ కి వస్తే 5000 నుంచి 6000 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితైతే ఉంది. అలాంటి వారు సినిమా చూడాలి అంటే అది సాధ్యం కానీ విషయమనే చెప్పాలి. ఒకప్పుడు ఏ హీరో సినిమా రిలీజ్ అయిన కూడా టిక్కెట్ రేట్ అనేది ఒకే విధంగా ఉండేది. అందువల్ల చాలామంది సినిమాను చూడడానికి ఇష్టపడేవారు. కలెక్షన్లు సైతం ఎక్కువగా వచ్చేవి, రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఎక్కువగానే ఉండేవారు. కానీ ఈ రోజుల్లో థియేటర్ కి రావాలంటేనే సగటు ప్రేక్షకుడు భయపడిపోతున్నాడు… నిజానికి సినిమా బడ్జెట్ పెరగడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే హీరోలు వాళ్ల రెమ్యూనరేషన్స్ ను వందల కోట్లలో ఛార్జ్ చేస్తున్నారు. దానివల్ల సినిమా మీద పెట్టాల్సిన బడ్జెట్ మొత్తం వాళ్ల రెమ్యూనరేషన్ రూపం లోనే ఇవ్వాల్సి వస్తుంది.
ఇలాంటి సమయంలో సినిమాను చాలా తక్కువ ఖర్చులో చుట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి ఏదో తెలియని అసంతృప్తి కలుగుతుంది. మరి వీటన్నింటికి చెక్ పెట్టాలంటే హీరోల పారితోషికాన్ని భారీగా తగ్గించాల్సిన అవసరమైతే ఉంది. ఒక్కో హీరో వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం ఏంటి?
పాన్ ఇండియాలో మార్కెట్ ఉన్నంత మాత్రాన అంత మొత్తం లో పారితోషికాన్ని ఛార్జ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్ కి విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. సినిమా సక్సెస్ అయితే పర్లేదు. కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ప్రొడ్యూసర్ తన ఇంటిని కూడా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు… అందువల్లే బడ్జెట్ కంట్రోల్లో ఉండాలంటే ముందు హీరో రెమ్యునరేషన్స్ కంట్రోల్ లోకి రావాలి…
సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు ఒకసారి డిస్కస్ చేసి ఏ హీరో ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవాలి టైర్ వన్ హీరో సక్సెస్ ఫుల్ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టగలదు. మీడియం రేంజ్ హీరో సక్సెస్ ఫుల్ సినిమాకి ఎంత కలెక్షన్స్ వస్తాయి. వాటిని బట్టి వల్ల పారితోషికాలు డిసైడ్ చేస్తే బాగుంటుంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
