Rajamouli Chiranjeevi: సినిమాలు అందరూ చేస్తారు. కానీ గుర్తుండిపోయే సినిమాలను కొందరు మాత్రమే చేయగలరు. అలాంటి వాళ్ళలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన ఎన్ని సినిమాలు చేసిన కూడా అవన్నీ సూపర్ సక్సెస్ గా నిలిచాయి అంటే దానికి కారణం ఆయన హార్డ్ వర్క్ అనే చెప్పాలి. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న రాజమౌళి ఇప్పటికీ ఒక సినిమా కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమా పూర్తయ్యేంతవరకు అదే ట్రాన్స్ లో ఉంటాడు. మొత్తానికైతే తను అనుకున్నట్టుగా ఔట్ పుట్ వచ్చేంతవరకు వదిలిపెట్టడు. అలాంటి రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి కెరియర్ మొదట్లోనే జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమా చేసి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను సాధించాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉంది.
కానీ అది అనుకోని కారణాలవల్ల పట్టాలెక్కలేదు. నిజానికి చిరంజీవిని కొత్తగా చూపించడానికి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడట అని అప్పట్లో చిరంజీవి బిజీ గా ఉండటం వల్ల ఆ సినిమాని చేయలేదట. మొత్తానికైతే రాజమౌళి ఆ స్టోరీని పక్కన పెట్టి ప్రభాస్ ఛత్రపతి సినిమాను చేశాడు.
మొత్తానికైతే రాజమౌళి అప్పుడు చేసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వచ్చి ఉంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉండేదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాబట్టి రాజమౌళి కూడా అదే అనుకున్నాడట. కానీ అది వర్కౌట్ కాలేదు.
ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. చిరంజీవితో సినిమాలు చేసే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. తన సినిమాలో ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో చిరంజీవితో నటింపజేస్తే తప్ప సోలోగా చిరంజీవిని హీరోగా పెట్టి ఇప్పుడు ఆయన సినిమా చేసే పరిస్థితైతే లేదు. ఎందుకంటే ఆయన మార్కెట్ ఎల్లలు దాటిపోయింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడున్న స్టార్ హీరోలతోనే సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…