Jailer 2 Vs Robo: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి స్టార్ హీరో మరొకరు లేరు అనేది వాస్తవం…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆయన చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మంచి సినిమాలను చేస్తు ముందుకు సాగుతున్నాడు…ఇక ఈ సినిమా తర్వాత నెల్సన్ డైరెక్షన్ చేస్తున్న ‘జైలర్ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేయబోతున్నాడు. ఇప్పటికే సగం సినిమా షూట్ కంప్లీట్ చేశారు. ఇక వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి ఇలాంటి సందర్భంలో జైలర్ 2 సినిమాకి రజనీకాంత్ చేసిన రోబో సినిమాకి మధ్య ఏదో కనెక్షన్ ఉందని కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి జైలర్ కి రోబో కి మధ్య ఎలాంటి కనెక్షన్ ఉంటుంది.
Also Read: రెమ్యూనరేషన్ విషయంలో యాంకర్ సుమ ని దాటేసిన సుడిగాలి సుధీర్!
ఒకవేళ ఉంటే ఆ కనెక్షన్ ని చాలా కనెక్టివిటీగా చెప్పగలుగుతారా? లేదా అనేది కూడా క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండింటి మధ్య కనక కనెక్షన్ ఉంటే సినిమా అనేది నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోతోంది. అలాగే రజనీకాంత్ యాక్టింగ్ కూడా ఈ సినిమాలో చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉండబోతుందని నెల్సన్ ఇంతకు ముందే మనకు తెలియజేశాడు.
కాబట్టి నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అవుట్ అఫ్ ది బాక్స్ ఉండాలంటే మాత్రం ఈ సినిమాలో అంతకుమించిన ఎలిమెంట్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి. లేకపోతే మాత్రం ఈ సినిమా తేలిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే రజినీకాంత్ లాంటి నటుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీని కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం మెప్పిస్తున్నాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన ఇప్పటికి సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పటికీ ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే ఆయన ఎంతటి క్రేజీని సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు…ఇప్పటివరకు ఎవ్వరు ఇలాంటి సినిమాలు చేసినా కూడా రానటువంటి గొప్ప గుర్తింపు రజినీకాంత్ కు ఆయన స్టైల్ తో వచ్చిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న ఆయన సూపర్ స్టార్ ఇమేజ్ ను అందుకోవడమే కాకుండా ఆయనను బీట్ చేసే హీరో మరొకరు లేరు అనే అంతలా గుర్తింపును సంపాదించుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…