Nagarjuna 100th film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వర రావు దగ్గరి నుంచి ప్రస్తుతం అఖిల్ వరకు వాళ్ళందరూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. నాగార్జున సైతం డిఫరెంట్ సినిమాలను చేయడమే కాకుండా ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్నాడు…ఒకప్పుడు ఎక్స్పరమెంట్లు చేయడంలో నాగార్జున ముందు వరుసలో ఉండేవాడు. ఒక జానర్ లో సినిమా చేస్తే తర్వాత సినిమా ఇంకొక జానర్ లో చేసేవాడు. అలా డిఫరెంట్ తరహా సినిమాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం కూడా చేశాడు. అందుకే ఆయన టాప్ హీరోల్లో ఒకడి గా ఎదిగాడు. ప్రస్తుతం తన వందో సినిమాని తమిళ్ దర్శకుడు అయిన కార్తీక్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు ప్లాప్ సినిమా అయిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాకి మధ్య కనెక్షన్ ఉందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.
కారణం ఏంటి అంటే నాగార్జున సినిమా కూడా సైకలాజికల్ డిజార్డర్ గా తెరకెక్కుతోందట…నాగార్జున తన వందో సినిమాకి ఎక్స్పరమెంట్ చేస్తున్నాడు. ఈ సినిమా కనక వర్కౌట్ అయితే మాత్రం నాగార్జున టాప్ లెవెల్ కి వెళ్ళిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒకవేళ డీలాపడితే మాత్రం తన మార్కెట్ పూర్తిగా తగ్గిపోతోంది.
ఇక వన్ నేనొక్కడినే సినిమాలో హీరో ఎలాంటి డిసీజ్ తో ఇబ్బంది పడతాడో ఈ సినిమాలో నాగార్జున కూడా అలాంటి ఒక ప్రాబ్లం తోనే ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి కార్తీక్ ఈ సినిమా కథని చాలా ఇంప్రెస్సివ్ గా రాసుకున్నాడట. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. నాగార్జున సైతం దానిని యాక్సెప్ట్ చేసి తన వందో సినిమాగా చేయడానికి ముందుకు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
నిజానికి ఇతర హీరోలైతే ఇలాంటి కథలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే సీనియర్ హీరోలందరు చాలు ఎక్స్పెరమెంట్లూ చేయడం ఎందుకు అనే ధోరణిలో వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్స్పరమెంట్లకు తావిచ్చే అవకాశం లేదు. నాగార్జున సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం తను ప్రయోగాలు చేస్తూనే ఉంటానని గతంలో చెప్పాడు. తన మాటకు కట్టుబడి ఇప్పటికి ఆయన మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం…