Ibomma Immadi Ravi Father: ఐ బొమ్మ(I Bomma) వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి(Immadi Ravi) అరెస్ట్ పెద్ద సంచలనం రేపింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. CP సజ్జనార్ కూడా నేడు చిరంజీవి(Megastar Chiranjeevi), రాజమౌళి(SS Rajamouli) వంటి టాప్ సెలబ్రిటీలతో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి జరిగిన వాస్తవాలను మీడియా కి తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. తన భార్య తో వివాదాలు ఉండడం వల్ల, విడాకులు తీసుకునేందుకు ఆమె ఇండియా కి రావడం, వచ్చిన తర్వాత వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి ఇమ్మడి రవి వివరాలను మొత్తం అందించడం తో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 21000 సినిమాలను పైరసీ చేసాడట. కేవలం పైరసీ చేయడమే కాదు, బెట్టింగ్ యాప్స్ ని కూడా నడిపేవాడట. ఎంతో మంది అమాయకులు ఇతని కారణంగా ప్రాణాలు తీసుకున్నారని సజ్జనార్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే ఇమ్మడి రవి తండ్రి అప్పారావు లేటెస్ట్ గా మీడియా తో మాట్లాడిన కొన్ని మాటలు పెద్ద దుమారం రేపింది. కన్నతండ్రి నే ఈ రేంజ్ లో కొడుకు గురించి మాట్లాడుతున్నాడు అంటే, రవి ఎలాంటి వాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన మాట్లాడుతూ ‘నాకు మందు, సిగరెట్ లాంటివి చెడు అలవాట్లు లేవు. నా కొడుక్కి కూడా అలాంటి అలవాట్లు లేవు. కానీ వాడికి వాడికి అమ్మ లాంటి క్రిమినల్ బ్రెయిన్ వచ్చింది. మా వంశం లో రవి లాంటి ఖిలాడీలు ఎవ్వరూ లేరు. చాలా పద్ధతైన కుటుంబం మాది. కానీ వాళ్ళ అమ్మ మంచిది కాదు, అన్నీ నా ఆలోచనలకూ వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటుంది. అందుకే ఆమెతో విభేదించి విడిపోవాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు అప్పారావు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మా కుటుంబం మొత్తం చాలా సైలెంట్ గా గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది. కానీ నా కొడుకు వల్ల ఈరోజు రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది. నా కొడుకు ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈరోజు వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారో తెలియదు. రవి మా ఇల్లు వదిలి వెళ్ళిపోయి 15 ఏళ్ళు అయ్యింది. కుటుంబ కలహాల కారణంగానే వాడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. వాడు ఇంత డబ్బులు సంపాదించినా, ఎప్పుడూ అతని దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.