Ram Charan And Shankar: రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చెంజర్ సినిమా రోజురోజుకీ లేట్ అవుతుండడంతో ఆ సినిమా కి సంభందించిన ఆసక్తికరమైన కామెంట్లు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా కి సంబంధించి రామ్ చరణ్ కి శంకర్ కి మధ్య కొన్ని విభేదాలు తలెత్తినట్టుగా తెలుస్తుంది.
సినిమా షూటింగ్ రోజు రోజుకి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ శంకర్ తో కొంచెం సీరియస్ గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దానికి శంకర్ కూడా సీరియస్ గానే సమాధానం చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఎక్కడ కూడా డిలే అవ్వకుండా ఉండడానికి దిల్ రాజు మొదటి నుంచి తన వైపు నుంచి చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నప్పటికీ ఎప్పుడు ఏదో కారణం చేత షూటింగ్ అనేది డిలే అవుతూ వస్తుంది. ఇక శంకర్ ఈ సినిమా పైన తన పూర్తి ఫోకస్ పెట్టనట్టుగా మొదటి నుంచి వార్తలు అయితే వస్తున్నాయి. మరి శంకర్ లాంటి ఒక ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు.ఇక ఇప్పటికే పెట్టిన పెట్టుబడి భారీగా పెరిగిపోయింది అంటూ దిల్ రాజు ఆ లాస్ ని కవర్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక ఇదే క్రమంలో రామ్ చరణ్ కి శంకర్ కి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తినట్టు గా తెలుస్తుంది. ఇంతకీ అసలు సినిమా షూటింగ్ అనేది నడుస్తుందా లేదా అనే విషయం పైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమా పైన మంచి అభిప్రాయంతో ఉన్నట్టుగా లేరు ఎందుకంటే వాళ్ళ షూటింగ్ కూడా ఒకరోజు చేస్తే పది రోజులు వాయిదా పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ కి ముందు నుంచే ఈ సినిమా షూట్ స్టార్ట్ చేశారు ఇక త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయి 2 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికి కూడా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి చేయకుండా శంకర్ చెక్కుతూనే ఉన్నాడు.
రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా పైన డేట్స్ కేటాయించాల్సిన అవసరం వస్తున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమాకి డేట్స్ ఇంకా ఎన్ని రోజులు కేటాయించాలి అనే దానిపైన ఒక క్లారిటీ లేకపోవడంతో బుచ్చిబాబు సినిమాని రామ్ చరణ్ ఆపుతు వస్తున్నాడు. మరి గేమ్ చెంజర్ సినిమాకి మోక్షం లభించేది ఎప్పుడు అనేదానిపైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది…