https://oktelugu.com/

Bollywood : ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన ఖాన్ త్రయం పరిస్థితి ఏంటి..? వీళ్ళలో ఎవరు ముందున్నారు…

అయినప్పటికీ సల్మాన్ ఖాన్ మాత్రం ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టు కూడా సాధించలేకపోతున్నాడు. ఇక షారుక్ ఖాన్ తో పోలిస్తే సల్మాన్ ఖాన్ పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : July 5, 2024 / 09:38 PM IST

    Bollywood, Aamir Khan, Salman Khan, Shahrukh Khan,

    Follow us on

    Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాన్ త్రయం గా పిలువబడే అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వాళ్ల కంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు… కొన్ని సంవత్సరాల నుంచి వీళ్లే బాలీవుడ్ ఇండస్ట్రీ ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్నారు. ఇక ఏ ఇండస్ట్రీ హిట్టు సినిమా రావాలన్న అది ఈ ముగ్గురి నుంచి రావాల్సిందే తప్ప, వేరే హీరో నుంచి ఇండస్ట్రీ హిట్ వచ్చే అవకాశాలైతే లేవు. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఈ ముగ్గురి హవా కొంత వరకు తగ్గింది.

    ఇక అమీర్ ఖాన్ అయితే ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా తర్వాత మరొక సినిమాని అనౌన్స్ చేయలేదు. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తమిళ్ దర్శకుడు అయిన మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అలాగే షారుఖ్ ఖాన్ కూడా మరికొన్ని సినిమాల్లో నటిస్తూ తను కూడా బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో షారుక్ ఖాన్ గత రెండు సినిమాలైనా పఠాన్, జవాన్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. కానీ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన డంకీ సినిమాతో భారీ ప్లాప్ ను మూట గట్టుకున్నాడు.

    అయినప్పటికీ సల్మాన్ ఖాన్ మాత్రం ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టు కూడా సాధించలేకపోతున్నాడు. ఇక షారుక్ ఖాన్ తో పోలిస్తే సల్మాన్ ఖాన్ పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి. తనకు సరైన సక్సెస్ పడి దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతుంది. మరి ఇలాంటి క్రమంలో ఆయన తమిళ్ డైరెక్టర్ అయిన మురుగదాస్ తో చేస్తున్న సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    అలాగే దీని తర్వాత అట్లీ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అట్లీ జవాన్ రూపంలో షారుఖ్ ఖాన్ కి ఒక భారీ సక్సెస్ ని అందించాడు. అదేవిధంగా తనకు కూడా అలాంటి సక్సెస్ నే అందిస్తాడు అనే కాన్ఫిడెంట్ తో సల్మాన్ ఖాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఖాన్ త్రయం లో షారుఖ్ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడు…