Akash Puri: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది హీరోలకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్…ఆయనతో సినిమా చేసిన తర్వాత చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా మారారు. ఒక్కో హీరోకి ఒక్కో మ్యానరిజం ను సెట్ చేసిన ఆయన తన కొడుకు విషయంలో మాత్రం చాలా వరకు నిర్లక్ష్యం వహిస్తున్నాడు. ఇప్పటికే ఆకాష్ పూరి హీరోగా మారాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. ‘మెహబూబా’ సినిమాతో ఆకాష్ ను పూరి జగన్నాథ్ హీరోగా లాంచ్ చేశాడు. ఆ తర్వాత ‘చోర్ బజార్’ లాంటి సినిమాలు చేసినప్పటికి అవేవీ పెద్దగా కలిసి రాలేదు…ప్రస్తుతం ఆయన ‘తల్వార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే గొప్ప గుర్తింపు సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…
Also Read: ‘ఛాంపియన్’ టీజర్ లో శ్రీకాంత్ కొడుకు రోషన్ కుమ్మేసాడుగా…
మాస్ హీరోగా అవతారం ఎత్తాలనే ఉద్దేశ్యంతోనే ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడు. ఇక దీనివల్ల ఆయన కెరియర్ చాలా వరకు డౌన్ ఫాల్ అయితే అవుతోంది. మొదట్లో ఒకటి రెండు సక్సెస్ లు వచ్చిన తర్వాత మాస్ హీరోగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మొదట్లోనే మాస్ హీరో అవ్వాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని అని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
ఇక పూరి జగన్నాథ్ ఇప్పటికైనా మేల్కొని తన కొడుకుకి మంచి సక్సెస్ అందిస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతిని లీడ్ రోల్ లో పెట్టి బెగ్గర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తను ఫామ్ లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ చేసిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ బాట పడుతుండటంతో అతనికి పెద్ద హీరోల నుంచి మరి ఇలాంటి క్రమంలో పూరి జగన్నాథ్ ఎలాగైనా తన కొడుకుకి కూడా మంచి విజయాన్ని కట్టబెట్టాల్సిన అవసరం కూడా ఉందని సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఇప్పుడున్న స్టార్ హీరోలతో పాటుగా పూరి జగన్నాథ్ కొడుకు కూడా అంతటి ఇమేజ్ ని సంపాదించుకుంటాడా లేదా అనేది…