Bigg Boss 9 Telugu Emmanuel: టెలివిజన్ రంగంలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో అత్యంత ప్రస్టేజియస్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో ప్రస్తుతం అందరినీ అలరిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు 9 వ సీజన్ కూడా స్టార్ట్ చేశారు. మరి ఇలాంటి క్రమంలోనే సరికొత్తగా కామనర్స్ ను భాగం చేయడం అనేది ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో ఈ షో మీద చాలామంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ షోలో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ గా ఒక పోటీ అయితే జరగబోతోంది. ఇందులో ఎవరు ఎవరి పైన పై చేయి సాధిస్తారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ఇక మాస్క్ మ్యాన్ హరీష్ కి ఇమాన్యుయల్ కి జరిగిన గొడవలో సైతం ఇమ్మానుయల్ కి సపోర్ట్ బిగ్ బాస్ మాట్లాడాడు…కారణం ఏంటి అంటే ఇమాన్యుయల్ కి ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. కాబట్టి అతనికి సపోర్టుగా ఉంటేనే తన ఫ్యాన్స్ కూడా బిగ్ బాస్ షో ను ఇష్టపడతారు. అలాగే ఈ షోని చూడడానికి కూడా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలా కాకుండా కామనర్స్ కి సపోర్ట్ గా మాట్లాడితే కామనర్స్ కి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కాబట్టి ఇమానూయల్ ఫ్యాన్స్ షో ను బ్యాడ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
కాబట్టి కొన్నిసార్లు బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఇలాంటి స్ట్రాటజీలు మైంటైన్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. అందువల్లే వల్ల డిస్కషన్స్ తో సంబడం లేకుండా బిగ్ బాస్ కూడా సెలబ్రిటీస్ వాళ్ళవైపు షిఫ్ట్ అవుతూ ఉంటాడు అనేది మనకు క్లియర్ కట్ గా తెలిసిపోయింది.
మరి ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ లో స్ట్రాటజీలను మైంటైన్ చేస్తూ ముందుకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఫైనల్ గా కప్పు గెలుస్తారనేది చెప్పకనే చెబుతున్నారు… నిన్న జరిగిన వివాదంలో మాస్క్ మ్యాన్ తప్పు ఎంతుందో ఇమాన్యుయల్ తప్పు కూడా అంతే ఉంది. కానీ బిగ్ బాస్ మాత్రం ఇమ్ము తప్పేమీ లేదు అన్నట్టుగా మాట్లాడాడు. దానివల్లనే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా చాలా వరకు సంతోషపడి సోషల్ మీడియాలో బిగ్ బాస్ షో గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి స్ట్రాటజీలను మెయింటైన్ చేస్తే జెన్యూన్ గా షో ను చూసే ప్రేక్షకుల్లో షో మీద చాలా వరకు బ్యాడ్ ఇంపాక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. మరి అదొకటి తెలుసుకొని ముందుకు సాగితే బిగ్ బాస్ సీజన్ 9 చాలా వరకు సక్సెస్ ఫుల్ గా రాణిస్తుంది. లేకపోతే నెగెటివిటీ ని సంపాదించుకునే అవకాశం ఉంది…