Animal: యానిమల్ బడ్జెట్ ఎంత? ఎన్ని వందల కోట్ల లాభం వచ్చిందో తెలుసా?

విమర్శల మధ్య యానిమల్ బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. నిర్మాతలు ఈ చిత్రంతో భారీగా ఆర్జించారని ట్రేడ్ వర్గాల అంచనా. అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం యానిమల్ మూవీ రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

Written By: Suresh, Updated On : December 19, 2023 6:18 pm

Animal OTT

Follow us on

Animal: యానిమల్ బాక్సాఫీస్ రన్ ఇంకా ముగియలేదు. మూడు వారాలు గడచినా చెప్పుకోదగ్గ వసూళ్లు ఈ చిత్రం రాబడుతుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రానికి దర్శకుడు. రన్బీర్ కపూర్ హీరోగా నటించారు. యానిమల్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఒక వర్గం చిత్రం అద్భుతం అంటే… మరో వర్గం మాత్రం చెత్త సినిమా అని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. యానిమల్ మూవీ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అలాగే వైలెన్స్ డోస్ కూడా పెంచారు. హీరో క్యారెక్టరైజేషన్ పురుషాధిక్యతను ప్రోత్సహించేదిగా ఉందన్న విమర్శలు తలెత్తాయి.

విమర్శల మధ్య యానిమల్ బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. నిర్మాతలు ఈ చిత్రంతో భారీగా ఆర్జించారని ట్రేడ్ వర్గాల అంచనా. అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం యానిమల్ మూవీ రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 140 కోట్లు రాబట్టారు. అంటే 60 కోట్లు షేర్ వసూలు చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్లే. యానిమల్ వరల్డ్ వైడ్ రూ. 800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. యానిమల్ వరల్డ్ వైడ్ షేర్ రూ. 400 కోట్లకు పైనే ఉంది.

ఈ చిత్రాన్ని థర్డ్ పార్టీకి అమ్మలేదు. అడ్వాన్స్ తీసుకుని నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్, ఇతర ఖర్చులు పోగా రూ. 300 కోట్ల లాభం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యానిమల్ చిత్రానికి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, ప్రవీణ్ రెడ్డి వంగా నిర్మించారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి బ్రదర్స్ యానిమల్ చిత్రంతో భారీగా లాభ పడ్డారని తెలుస్తుంది. అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చి నిర్మాతగా మారిన ప్రవీణ్ రెడ్డికి లైఫ్ టైం సెటిల్మెంట్ యానిమల్ మూవీ ఇచ్చింది.

జీవితాంతం అమెరికాలో ఉన్నా కూడా ఇన్ని కోట్లు ఆర్జించేవారు కాదు. యానిమల్ మూవీ ఒక రివేంజ్ డ్రామ. తన తండ్రిని చంపేందుకు ప్రయత్నం చేసిన వాళ్ళను హీరో రన్బీర్ కపూర్ వెంటాడి చంపుతాడు. బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. అనిల్ కపూర్ కీలక పాత్రలలో కనిపించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు.