Chatrapathi Prabhas: ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఆ సినిమాని చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు… కారణం ఏంటి అంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ప్రేక్షకులకు ఎక్కువ వినోదాన్ని పంచుతుంది. అలాగే తమ అభిమాన హీరోని స్క్రీన్ మీద చూడడానికి వాళ్ళు ఎన్ని డబ్బులు అయిన సరే ఖర్చు పెట్టడానికి వెనకాడరు… అలాంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరో స్థానాన్ని కూడా కట్టబెట్టాయి.
తన కెరియర్ స్టార్టింగ్ లో రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ఛత్రపతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాలోని ఒక సీన్ ని ప్రభాస్ డైరెక్ట్ చేశాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. సినిమా షూట్ జరుగుతున్నప్పుడు రాజమౌళికి 101 ఫీవర్ వచ్చిందట.
దాంతో ఆయనకి కళ్ళు తిరిగాయట…దాంతో ఆయనకి రెస్ట్ ఇచ్చి ప్రభాస్ కొన్ని షాట్స్ ను డైరెక్షన్ చేశాడు… అవేంటి అంటే ప్రభాస్ భానుప్రియ తన తల్లి అని తెలుసుకొని తన దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకి పికిల్స్ పెట్టి పంపించాలనే ఒక పని వస్తోంది. కానీ ఆమె అప్పటికే హై ఫీవర్ తో బాధపడుతూ ఉండటం చూసిన ప్రభాస్ శ్రేయతో కలిసి తనే పచ్చళ్ళు పెడతాడు. ఆ సీన్స్ లో కొన్ని షాట్స్ ని ప్రభాస్ డైరెక్షన్ చేశాడట.
మొత్తానికైతే ఆ సీన్స్ చాలా ఎఫెక్టివ్ గా వచ్చాయి. రాజమౌళి సైతం ఆ సీన్స్ ని చూసి ప్రభాస్ ను శభాష్ అని మెచ్చుకున్నాడట. ఇక డైరెక్షన్ పట్ల ప్రభాస్ కి చాలా మంచి ఇంట్రెస్ట్ ఉందని అప్పట్లోనే రాజమౌళి దీని గురించి మాట్లాడాడు… మొత్తానికైతే ప్రభాస్ ఫ్యూచర్లో డైరెక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయనే ఒక హింట్ ఇచ్చాడు. చూడాలి మరి ప్రభాస్ ఫ్యూచర్ లో ఒక మంచి సినిమా డైరెక్షన్ చేస్తాడా లేదా అనేది…
