Bigg Boss 9 Telugu: చూస్తుండగానే నిన్న గాక మొన్న ప్రారంభం అయినట్టు అనిపిస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9) అప్పుడే 40 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 5 వారాల్లో ఇప్పటి వరకు శ్రేష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్ , ఫ్లోరా షైనీ మరియు దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. గత వారం శ్రీజ ఎలిమినేషన్ ఎంత అన్యాయంగా జరిగిందో మనమంతా చూశాము. ఈమె రీ ఎంట్రీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, అది జరుగుతుందో లేదో ప్రస్తుతానికి సస్పెన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి భరణి, తనూజ, దివ్య, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, రాము రాథోడ్ నామినేట్ అయ్యారు. వీరిలో అందరూ ఊహించినట్టుగానే తనూజ తిరుగులేని ఓటింగ్ తో, భారీ మార్జిన్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది.
ఆ తర్వాతి స్థానం లో సుమన్ శెట్టి నిలిచాడు. వీళ్లిద్దరు ప్రస్తుతం ఓటింగ్ లో మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ కంటే భారీ మార్జిన్ తో టాప్ లో కొనసాగుతున్నారు. వీళ్లిద్దరు తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నట్టే. వీళ్ళ గ్రాఫ్ పూటకి ఒకలాగా మారిపోతుంది. ఓటింగ్స్ మొదలైన మొదటి రోజు డేంజర్ జోన్ లో దివ్య, రాము ఉన్నారు. ఆ తర్వాత హౌస్ లో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దివ్య డేంజర్ నుండి దాదాపుగా సేవ్ అయ్యినట్టే. ఇక ఆ తర్వాత డేంజర్ జోన్ లోకి భరణి, రాము వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఓటింగ్ లో మొదటి రోజు నుండి తనూజ, సుమన్ శెట్టి తర్వాత మూడవ స్థానం లో కొనసాగుతున్న డిమోన్ పవన్ ఇప్పుడు డేంజర్ జోన్ లోకి వచ్చేసాడు. ఆయనతో పాటు దివ్య కూడా డేంజర్ జోన్ లోకి వచ్చింది. రాము సేవ్ అయ్యాడని టాక్.
కానీ ఇదే ఓటింగ్ నేడు కూడా కొనసాగుతుందా అంటే చెప్పలేం. గంటకు ఒకలాగా మారిపోతుంది. ఈ నలుగురి కి సరిసమానమైన శాతం లో ఓటింగ్స్ పడుతున్నాయి. అందుకే ఈ వారం వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు విశ్లేషకులు సైతం. గత వారం లో లాగానే ఈ వారం కూడా డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్స్ చేతుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్లకు ఎలిమినేషన్ ని తప్పించే ఒక పవర్ కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుందో, ఈ వారం ఫ్యూజులు ఎగిరే ట్విస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీపావళి కి స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి, ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని రేపే మొదలు పెట్టనున్నారు. కాబట్టి ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే అప్డేట్ చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంది.