
RGV’s Dangerous: తెలుగు సినిమా పరిశ్రమలో రాంగోపాల్ వర్మది ప్రత్యేక శైలి. చిత్రాల నిర్మాణంలో ఆయనదో డిఫరెంట్ స్టైల్. సినిమా మొదలైనప్పటి నుంచి చివరిదాకా సంచలనాలు సృష్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తాననుకున్న విధంగా నిజ జీవితాలను చిత్రాలుగా మలిచి పలు రికార్డులు సాధించారు. విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. వ్యక్తుల బయోపిక్ లను నిర్మించడంలోనూ ఆయనది అందెవేసిన చేయి. రక్త చరిత్ర తీసినా, కొండా చిత్రాలను తెరకెక్కించాలన్నా ఆయనకే చెల్లు. కథ, కథనంలో కొత్తదనం ఉండేలా చూసుకుంటూ నిత్యం ప్రేక్షకులను మెప్పించడం ఆయనకో సరదా.
ఈ నేపథ్యంలో ఆయన ఓ వైవిధ్యమైన సినిమాను తెరకెక్కిస్తున్నారు. డేంజరస్ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఉన్న సెక్స్ వాంఛలను తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్నారు. స్వలింగ సంపర్కం నేపథ్యంలో సాగే కథనంతో తొలి లెస్పియన్ చిత్రంగా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి.
ఇద్దరమ్మాయిల మధ్య ఉన్న ప్రేమను చూపించాలనే ఆలోచనతోనే ఈ చిత్రానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ ఎలా ఉంటుందో అమ్మాయి అమ్మాయి మధ్య కూడా అలాంటి ప్రేమే ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇందులో ఉంటుందని సమాచారం. గతంలో సైతం అమ్మాయిల మధ్య ప్రేమ గురించి ఫైర్, గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు వచ్చినా వాటిని ఆదరించాం.
డేంజరస్(RGV’s Dangerous) సినిమా కొత్త కోణంలో రూపుదిద్దుకుంటోంది. క్రిస్టో కరెన్సీ విధానంలో నాన్ ఫంగిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ) బిజినెస్ మోడల్ లో తొలిసారి సినిమాను విడుదల చేయబోతున్నారు. దీన్ని 100 యూనిట్లుగా విభజించి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read: ఏపీ నేతలు బాక్సింగ్, కరాటే నేర్చుకోవాలి.. తప్పదన్న రాంగోపాల్ వర్మ