Mahesh Babu- Anil Ravipudi: టాలీవుడ్ లో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. హీరో మహేష్ బాబు రాజమౌళి మూవీ పక్కన పెట్టేశారట. గుంటూరు కారం అనంతరం ఆయన దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమాకు పచ్చజెండా ఊపారట. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాజమౌళితో సినిమా అంటే ఈ హీరో అయినా ఎగిరి గంతేస్తారు. ఆయనతో మూవీ అంటే నయా రికార్డ్స్ నమోదవుతాయి. ఇమేజ్ ఎల్లలు దాటుతుంది. బాహుబలి చిత్రాలతో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేశాడు. వందల కోట్ల బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ సినిమాకు వంద నుండి నూట యాభై కోట్లు తీసుకుంటున్నాడు.
ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పేర్లు వరల్డ్ వైడ్ వినిపించేలా చేశాడు. ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టాడు. కాగా రిపీటెడ్ గా కొందరు హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన రాజమౌళి మరికొందరు స్టార్స్ తో అసలు సినిమాలు చేయలేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబుతో పాటు పలువురు రాజమౌళితో పని చేయని హీరోల జాబితాలో ఉన్నారు. ఎట్టకేలకు మహేష్ కి ఛాన్స్ వచ్చింది
ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ దశలో ఉండగానే రాజమౌళి మహేష్ తో మూవీ ప్రకటించారు. కోవిడ్ సమయంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ తో చేస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు. ఈ న్యూస్ మహేష్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఇక ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ నేపథ్యంలో మహేష్ మూవీ బడ్జెట్ రాజమౌళి అమాంతం పెంచేశాడు. ఆయన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో మహేష్ మూవీ తెరకెక్కనుంది.
వచ్చే ఏడాది మహేష్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సడన్ గా మరో వాదన తెరపైకి వచ్చింది. రాజమౌళిని పక్కన పెట్టిన మహేష్ బాబు గుంటూరు కారం అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ చేయనున్నాడట. అనిల్ సుంకర ఈ చిత్ర నిర్మాత అట. రాజమౌళిని కాదని అనిల్ రావిపూడితో మూవీ చేయడమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ నుండి తప్పుకోలేదు. అది మొదలు కావడానికి సమయం ఉండగా… ఈ గ్యాప్ లో అనిల్ రావిపూడి చిత్రం చేస్తాడట.