Mahesh Babu And Naresh: మహేష్ బాబు కి, నరేష్ కి మధ్య ఏం జరుగుతోంది…

గత సంవత్సరం మహేష్ బాబు తండ్రి అయిన కృష్ణ , అలాగే వాళ్ల అన్నయ్య అయిన రమేష్ బాబు మరణించడంతో మహేష్ బాబుకి సినిమాల పరంగా సపోర్ట్ ఇచ్చేవారు లేకుండా పోయారు.

Written By: Gopi, Updated On : January 23, 2024 3:31 pm
Follow us on

Mahesh Babu And Naresh: సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణిికిపుచ్చుకొని ఇండస్ట్రీ లో నయ సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు… ఇండస్ట్రీలో వేరే ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో వైవిధ్యమైన సినిమాలు చేయడమే కాకుండా భారీ సక్సెస్ లను అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే మహేష్ బాబు తన అందంతో, అభినయంతో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే గత సంవత్సరం మహేష్ బాబు తండ్రి అయిన కృష్ణ , అలాగే వాళ్ల అన్నయ్య అయిన రమేష్ బాబు మరణించడంతో మహేష్ బాబుకి సినిమాల పరంగా సపోర్ట్ ఇచ్చేవారు లేకుండా పోయారు. ఇక దాంతో తను ఒంటరిగా సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే సీనియర్ నటుడు అయిన నరేష్ కి మహేష్ బాబుకి మధ్య ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి అనే విషయం అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి నరేష్ కి, మహేష్ బాబు కి మధ్య సంబంధం ఏంటి అంటే సూపర్ స్టార్ కృష్ణ నరేష్ వాళ్ళ అమ్మ అయిన విజయ నిర్మలని పెళ్లి చేసుకున్నాడు. ఇక దానికి ముందు నరేష్ కి ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేకపోయిన కూడా విజయ నిర్మల కృష్ణ ని పెళ్లి చేసుకోవడం తో నరేష్ కూడా ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్ గా మారిపోయాడు. అంతే తప్పితే నరేష్ కి మహేష్ బాబు కి మధ్య ఎలాంటి బ్లడ్ రిలేషన్ అయితే లేదు. ఇక మొన్నటిదాకా కృష్ణ, విజయనిర్మల ఉన్నారనే ఉద్దేశ్యం తో నరేష్ ను ఇష్టమున్న లేకపోయిన మహేష్ బాబు భరించుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు నరేష్ చేసే పనులు బాగుండటం లేదు . అందువల్లే తనని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక పవిత్ర లోకేష్ తో పెట్టుకున్న ఎఫైర్ కి సంబంధించిన వార్తలు కూడా ఇప్పుడు బయటకు రావడంతో నరేష్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది.

ఇక ఇలాంటి సమయం లో అవసరం ఉన్న లేకపోయిన మీడియా ముందు కావాలనే మహేష్ బాబు ప్రస్తావన తీసుకువచ్చి, మహేష్ తనతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడని, తనతో చాలా క్లోజ్ గా ఉంటాడని బయట ప్రెస్ మీట్ లల్లో చెబుతూ వస్తున్నాడు. అయితే సమాజాన్ని భ్రష్టు పట్టించే పనులు చేసే నరేష్ తో మహేష్ కి ఫ్రెండ్షిప్ ఏంటి అనే కోణం లో మహేష్ బాబు జనం దృష్ఠిలో చాలా బ్యాడ్ అయిపోతున్నాడు. అందుకే మహేష్ నరేష్ ని కొద్ది రోజుల నుంచి దూరం పెడుతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక నరేష్ వైఖరిని చూసిన మహేష్ బాబు అభిమానులు మాత్రం నరేష్ మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అసలు మహేష్ బాబుతో నరేష్ కు సంబంధం ఏంటి ఆయన పని ఆయన చూసుకోక మహేష్ బాబుని ఎందుకు బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు అని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా నరేష్ ను విమర్శిస్తున్నారు…