https://oktelugu.com/

Allu Arjun case : అల్లు అర్జున్ కేసు విషయం లో చిరంజీవి చేస్తున్న హెల్ప్ ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఇతర ఇండస్ట్రీల ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమాత్రం తక్కువ కాదంటూ ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు...

Written By:
  • Gopi
  • , Updated On : December 29, 2024 / 04:21 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun case : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా లోకి కూడా స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన పుష్ప సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి పాన్ ఇండియాలో పెను రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఇక దంగల్ సినిమా రికార్డును బ్రేక్ చేయడానికి కూడా ఆయన సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ కేసు నుంచి బయటికి తప్పించడానికి చిరంజీవి కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వాళ్ళందరిని కలుస్తూ ఆయన పైరవీలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి నటుడు ఇప్పుడు అల్లు అర్జున్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుసుకున్న మెగా అభిమానులు అల్లు అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఆయన అల్లు అర్జున్ కి ఎలాంటి ఇబ్బంది కలకూడదనే విధంగా చాలా ముందస్తు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…

    ఇక ఇదిలా ఉంటే చిరంజీవి అటు బన్నీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఇటు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లలో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రి రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో పాటుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు మెగా బ్రదర్స్ ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక చిరంజీవి ఎంత మంచి మనిషి అనేది మనందరికీ తెలుసు…అలాగే ఆయన సినిమాలు ఇప్పుడు కూడా ఎంత మంచి ఆదరణను అందుకుంటున్నాయో కూడా మనకు తెలిసిందే.

    ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి సినిమాలనే కాకుండా తన ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తనే ముందుండి నిలబడి వాటి సాల్వ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తాడు. అందులో భాగంగానే అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలను కూడా తనే ముందుండి పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నాడు. మరి బన్నీ గొడవ ఎప్పుడు పరిష్కారం అవుతుంది మళ్లీ ఆయన షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడు అనేది తెలియాల్సి ఉంది…