World War II Effected: ఒకవైపు తెలుగు చిత్ర పరిశ్రమ శర వేగంగా అభివృద్ధి చెందుతున్న రోజులవి.అప్పటికి ఇంకా స్వాతంత్రం మన భారతదేశానికి సంక్రమించలేదు.అంతకు ముందు సంవత్సరమే అంటే 1941 లో ధర్మ పత్ని సినిమా ద్వారా తెరంగేట్రం చేశాడు అక్కినేని నాగేశ్వరరావు.1942వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది.ఈ యుద్ధంతో తెలుగు తో పాటు మిగతా భాషల చలనచిత్ర రంగాలకి పెద్ద అవాంతరం ఏర్పడింది. దీంతో సినిమా పరిశ్రమ అనేక ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది.అయినప్పటికీ కూడా ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా పోటీ పోటీగా సినిమాలు విడుదల అయ్యాయి.
జెమినీ సంస్థ వారి బాలనాగమ్మ సినిమా ఘన విజయం సాధించింది.ఈ సినిమా ద్వారా కాంచనమాల మరియు గోవిందరాజుల సుబ్బారావుకి మంచి బ్రేక్ లభించింది.బాలనాగమ్మ తెలుగుప్రజలల్లో బాగా పేరుగాంచిన బుర్రకథ.ఇది జెమినీ వారి రెండవ తెలుగు చిత్రం. 1942లో నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో అత్యంత ప్రేక్షకాదరణ పొంది సంస్థకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఆ కలెక్షన్లతో తర్వాత చంద్రలేఖ సినిమా తీశారు.
ఇక అదే సమయంలో వచ్చిన శాంతావారి బాలనాగమ్మ పరాజయం పాలైంది. మరోవైపు కెవి రెడ్డి రూపొందించిన తొలి చిత్రం భక్త పోతన బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో చిత్తూరు నాగయ్య లీడ్ రోల్ పోషించగా చరిత్రలో ఆ తరహా పాత్రలకు ఆయన్ను మోడల్ గా నిలిపింది.చిత్తూరు నాగయ్య నటించిన భక్త పోతన చూసిన ముమ్మిడివరం బాలయోగికి తాను నటించిన పోతన చిత్రం చూపిస్తే ఆయన సమాధి నుంచి బయటకు వస్తారని గుమ్మడి ఎప్పుడు చమత్కరించేవారు.
ఇక ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఆ చిత్తూరు నాగయ్య నటన చూసి ఆయనని పోతన ఏమైనా ఆవహించాడా అన్న భావం కలిగిందట టీం సభ్యులకి.. ఈ చిత్రంలోని పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.ఇక రాజరాజేశ్వరి సంస్థ నుంచి వచ్చిన సుమతి చిత్రం అలాగే సారథి రామబ్రహ్మం అందించిన విలక్షణ చిత్రం పత్ని సినిమా యావరేజ్ గా ఆడాయి.భక్త ప్రహ్లాద, దీనబంధు, సత్యభామ, సత్యమే జయం వంటి తదితర చిత్రాలన్నీ కూడా పరాజయం పాలయ్యాయి.ఇక రెండవ ప్రపంచ యుద్ధం ఈ విధంగా చలనచిత్ర రంగానికి ఎంతో పెద్ద అవాంతరాన్ని ఏర్పరిచింది.