https://oktelugu.com/

Samantha: దారుణమైన కండీషన్ లో సమంత… సడన్ గా ఏమైంది?

టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబుతో సమంతకు వాగ్వాదం నడుస్తుంది. ఆమె అనారోగ్యం అంతా డ్రామా అని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. బహుశా నేను అనారోగ్యంతో బాధపడుతున్నది నిజమే అని సమంత ఇలా చెప్పాలనుకుంటున్నారేమో. సమంత ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నారు. సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : April 27, 2023 / 09:06 AM IST
    Follow us on

    Samantha: సమంత లేటెస్ట్ పోస్ట్ షాక్ ఇస్తుంది. ఆక్సిజన్ మాస్క్ ధరించి ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సమంత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమెకు మయోసైటిస్ సోకింది. ఇది దీర్ఘకాలిక వ్యాధి అని సమాచారం. అందుకే నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 2022 అక్టోబర్ లో సమంత ఈ విషయాన్ని తెలియజేశారు. అనంతరం కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. నివాసంలోనే ఆమెకు ట్రీట్మెంట్ జరిగింది. శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో హెల్త్ కండిషన్ మీద సమంత రెస్పాండ్ అయ్యారు.

    ఒంట్లో ఓపిక లేదు. త్వరగా నీరసించిపోతున్నాను. నా కళ్ళు కాంతిని చూడలేకపోతున్నాయని కొన్ని సమస్యలు బయటపెట్టారు. సమంత ఆరోగ్యం మీద అభిమానుల్లో ఓ ఆందోళన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సమంత షేర్ చేసిన ఫోటో సంచలనమైంది. సదరు ఫోటోలో సమంత ఆక్సిజన్ మాస్క్ తో ఉన్నారు. ఆమె షేర్ చేసిన మరో ఫోటో చూశాక స్పష్టత వచ్చింది. ఆమె హైపర్బేరిక్ థెరపీ తీసుకుంటున్నారట. దానికి సంబంధించిందే ఆ ఫోటో.

    హైపర్బేరిక్ థెరపీ ట్రీట్మెంట్… వాపు, ఇన్ఫెక్షన్స్, డామేజైన కండరాలను బాగుచేయడంలో ఎంతో మేలు చేస్తుందట. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంతకు హైపర్బేరిక్ థెరపీ అవసరమట. ఈ విషయాన్ని అభిమానులతో సమంత తెలియజేశారు. అలాగే వ్యాయామం చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేశారు. సమంత ఆరోగ్యం మీద కొందరు విమర్శలు చేస్తున్న క్రమంలో సమంత ఈ విధంగా సమాధానం చెప్పారనిపిస్తుంది.

    టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబుతో సమంతకు వాగ్వాదం నడుస్తుంది. ఆమె అనారోగ్యం అంతా డ్రామా అని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. బహుశా నేను అనారోగ్యంతో బాధపడుతున్నది నిజమే అని సమంత ఇలా చెప్పాలనుకుంటున్నారేమో. సమంత ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నారు. సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ అందుబాటులోకి రానుంది. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రం చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు కాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 1న విడుదల కానుంది.