Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే సల్మాన్ భాయ్. ఇక తన చేతిలో ఉన్న సినిమాలతో విశ్రాంతి లేకుండా షూటింగ్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సల్లూ ‘టైగర్ 3’సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో షారూఖ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు. అందుకే సల్లూ భాయ్ నటించే ఈ ‘టైగర్ 3’ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక సల్లూ భాయ్ సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండ వు అందులో ఇప్పుడు రాబోతున్న సినిమా కాబట్టి టైగర్ 3పై సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరో ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు తెగ ఆందేళన చెందుతున్నారు. ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా? అయితే వీడియో పూర్తిగా చూసేయండి.
రీసెంట్ గా సల్మాన్ ఖాన్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఓ పెళ్లిలో డాన్స్ చేసిన సల్మాన్ వీడియోతో ఆయన అనారోగ్యం క్షీణించిందనే టాక్ వినిపిస్తుంది. ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉండే సల్మాన్ డాన్స్ స్టెప్స్ సరిగ్గా వేయకపోవడం ఏంటి అని ప్రశ్నలు వస్తున్నాయట అభిమానుల్లో.. అయితే సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో చూసిన అభిమానులు.. బ్యాడ్ బాయ్ ఆరోగ్యం కచ్చితంగా క్షీణిస్తోందని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో సల్లూ ఆరోగ్యంపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
నటుడు సల్మాన్ ఖాన్ ఓ వివాహ కార్యక్రమంలో డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. అదే సందర్బంలో సల్లూ భాయ్ డ్యాన్స్‌కి ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించింది. సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేస్తూ కాస్త అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిందన్న అనుమానం అభిమానుల్లో బలంగా నెలకొంది. చాలా ప్రోగ్రామ్స్ లో ఫుల్ ప్యాషన్ తో డ్యాన్స్ చేసిన సల్లూ ఈసారి పూర్తిగా డల్ గా కనిపించాడు. హమ్కా పీనీ హై అనే పాటకు సల్మాన్ ఖాన్ స్టెప్పులేశాడు. కానీ తనకు డాన్స్ ఇబ్బంది అయిందనే తెలుస్తోంది.
సల్మాన్ అన్ ఫిట్ గానూ, నీరసంగానూ కనిపించడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు విశ్రాంతి అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నెటిజన్లు రాశారు. టైగర్ 3 సినిమా విడుదలయ్యాక కాస్త విరామం తీసుకోండి అంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. అయితే సల్లూ భాయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విశ్రాంతి లేకుండా షూటింగ్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సల్లూ ‘టైగర్ 3’ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో షారూఖ్ అతిథి పాత్రలో కనిపించాడని తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ ప్రాంఛైజీలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్‌లో వస్తున్న తాజా చిత్రం టైగర్ 3. మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ హీరోయిన్‌గా నటిస్తోంది. షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ఇప్పటివరకున్న అప్‌డేట్. అయితే మేకర్స్ విడుదల తేదీ ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్‌లో పెడుతూ వస్తున్నారు. కాగా టైగర్ 3 విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు.. వెయిట్ చేయండి.. అని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. పులి గాయపడింది.. అని ట్వీట్‌తో కొన్ని రోజుల క్రితం టైగర్ 3 అప్‌డేట్ అందించి అభిమానులను ఖుషీ చేశాడు సల్లూభాయ్. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేసేందుకు యశ్ రాజ్ ఫిలిం ప్లాన్ చేస్తోంది.
ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలనాటి అందాల తార రేవతి చాలా కాలం తర్వాత మరోసారి స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. టైగర్ ప్రాంఛైజీలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై తర్వాత వస్తున్న సినిమా కావడంతో టైగర్ 3పై అంచనాలు భారీగా ఉన్నాయి.