https://oktelugu.com/

Salaar Collections: సలార్ కి అన్ని కోట్ల లాస్ వచ్చిందా..? మరి ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి..?

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమాకి 135 కోట్ల వరకు లాస్ వచ్చిందని కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఈ విషయం మీద ప్రొడ్యూసర్స్ ఏ రకంగాను స్పందించలేదు. కానీ సినిమాకి నిజంగానే లాస్ వచ్చిందా కావాలనే ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారా అంటూ ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రంగా బాధపడుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 11, 2024 / 02:25 PM IST

    what happened to salaar producer

    Follow us on

    Salaar Collections: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్…ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక రీసెంట్ గా ఆయన చేసిన కల్కి సినిమాతో వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తన గత చిత్రమైన సలార్ సినిమా కూడా దాదాపు 700 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టిందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా 700 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీలో ఒక మంచి సక్సెస్ ని అందుకుంది అంటూ చాలామంది చాలా గొప్పగా మాట్లాడుతున్నారు.

    అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమాకి 135 కోట్ల వరకు లాస్ వచ్చిందని కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఈ విషయం మీద ప్రొడ్యూసర్స్ ఏ రకంగాను స్పందించలేదు. కానీ సినిమాకి నిజంగానే లాస్ వచ్చిందా కావాలనే ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారా అంటూ ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రంగా బాధపడుతున్నారు. నిజానికి ఈ సినిమాకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాసెస్ వచ్చింది అనే విషయాన్ని ప్రొడ్యూసర్స్ ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. మరి అలాంటప్పుడు ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేసేవాళ్లకి ఈ సినిమాకి లాస్ వచ్చిందనే విషయం ఎలా తెలుసు? ప్రభాస్ మీద నెగిటివ్ ప్రచారం చేయడం కోసమే ఇలాంటి ఒక చీప్ ట్రిక్స్ ని ప్లే చేస్తున్నారా అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఇక ప్రశాంత్ నీల్ భారీ ఎత్తున తెరకెక్కించిన సలార్ సినిమా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో చాలావరకు సక్సెస్ అయింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయిన కూడా ఒక డీసెంట్ హిట్ గా మిగిలింది. అలాంటప్పుడు సినిమాకి లాసెస్ ఎందుకు వస్తాయి అని మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ సినిమాకి ప్రాఫిట్స్ వచ్చిన లాసెస్ వచ్చిన ప్రొడ్యూసర్స్ మాత్రం ఎక్కడా స్పందించలేదు. కాబట్టి ఈ సినిమా ప్రాఫిట్స్ లో ఉందనే చెప్పాలి. ఇక దానికి తోడుగా ఈ సినిమాకి సీక్వెల్ గా సలార్ 2 సినిమా కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాతో కలెక్షన్లు మరింత భారీగా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే సలార్ 2 సినిమా స్టోరీ మొత్తం సెకండ్ పార్ట్ లోనే ఉండబోతుంది. ఇక మొదటి పార్ట్ కి అంత ఆదరణ దక్కినప్పుడు సెకండ్ పార్ట్ కి మరింత ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

    అయితే ప్రభాస్ సినిమాకి ఎలాంటి లాసెస్ రాలేదని కావాలనే ఇలాంటి పుకార్లను చేస్తున్నారంటూ మరికొంతమంది సినీ మేధావులు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ మారుతితో చేస్తున్న రాజాసాబ్ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులను చేస్తూ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను వసూలు చేస్తుందనే కాన్ఫిడెన్స్ ను కూడా వ్యక్తం చేస్తున్నారు.ఇక కల్కి సినిమాతో అందుకున్న సక్సెస్ లా పరంపర ను ఇలాగే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…