Jabardasth Rowdy Rohini: రౌడీ రోహిణికి ఏమైంది? అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది?

రోహిణి కి గతంలో కాలుకు ఫ్యాక్చర్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె కాలుకు రాడ్ వేశారు. అయితే ఇప్పుడు ఆ రాడ్ ను తీసేశారు. ఇందుకోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : May 18, 2023 4:03 pm

Jabardasth Rowdy Rohini

Follow us on

Jabardasth Rowdy Rohini: సినీ రంగంలో రాణించాలనుకునే వారికి జబర్దస్త్ కామెడీ షో మంచి అవకాశ వేదికగా మారుతోంది. ఇందులో నటించిన వారు ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్లుగా మారిపోయారు. ఇప్పటికీ ఇందులోకి వచ్చిన వారు సినిమాల్లో ఎలాగోలా చాన్స్ లు కొట్టేస్తున్నారు. లేటేస్టుగా రౌడి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న రోహిణి సినిమాల్లో నటించి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే రోహిణికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అందుకే ఇటీవల ఆమె ఆసుపత్రిలో చేరిందనగానే చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఆమె కాలు సర్జరీ విషయాన్ని సోషల్ మీడియా మిత్రులతో పంచుకోగా వారు ఎమోషనల్ అవుతున్నారు.

రోహిణి కి గతంలో కాలుకు ఫ్యాక్చర్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె కాలుకు రాడ్ వేశారు. అయితే ఇప్పుడు ఆ రాడ్ ను తీసేశారు. ఇందుకోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే వారి ఎమోషన్ ను దృష్టిలో పెట్టుకొని రోహిణి స్వయంగా సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టారు. తన కోసం డాక్టర్లు ఎలా కష్టపడ్డారో తెలిసింది.

తన కాలులో ఉన్న రాడ్ ను తీసేసేందుకు ముందుగా హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిని సంప్రదించగా.. ఆ రాడ్ తీయడానికి కుదరని, స్కిన్ తో అటాచ్డ్ అయిందని తెలిపారు. కానీ తనకు యాక్సిడెంట్ అయిన సమయంలో సర్జరీ చేసిన వైద్యులను కలిసేందుకు మళ్లీ విజయవాడకు వచ్చానని తెలిపారు. ఇక్కడి వైద్యులు సుమారు 10 గంటల పాటు నిరంతరం శ్రమించి వైద్యులు రాడ్ తీసేశారని రోహిణి చెప్పారు. కొన్ని రోజుల పాటు కాలుపై బరువు పెట్టకూడదని చెప్పారని, అయితే పూర్తిగా కోలుకున్న తరువాత యథావిధి స్థాయికి వస్తానని తెలిపారు.

జబర్దస్త్ కామెడీతో ఫేమస్ అయిన రోహిణి బంగర్రాజు సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి స్నేహితురాలిగా కనిపించింది. అలాగే ఇటీవల రిలీజైన ‘సేవ్ ది టైగర్స్’ సినిమాలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇదే సమయంలో ఆమె ఆసుపత్రి పాలవడం బాధగా ఉందని, రోహిణి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చెప్పుకోచ్చారు. రోహిణి త్వరగా కోలుకోని మళ్లీ సినిమాల్లోకి రావాలని ఫ్యాన్స్ రకరకాల పోస్టులు పెడుతున్నారు.