https://oktelugu.com/

Hero Vishal : హీరో విశాల్ ఆరోగ్యానికి ఏమైంది..గుర్తుపట్టలేని విధంగా ఎందుకు మారిపోయాడు..? ఆందోళనలో అభిమానులు!

ఈమధ్య కాలంలో విశాల్ కి సరైన సూపర్ హిట్ లేదు. చాలా కాలం తర్వాత వచ్చిన సూపర్ హిట్ 'మార్క్ ఆంటోనీ' కూడా ఆ చిత్రంలో విలన్ గా నటించిన ఎస్ జె సూర్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. అయితే రీసెంట్ గా ఈయన తీవ్రమైన అనారోగ్యం తో బాధపడుతున్నాడని వార్త రావడం తో అభిమానులు కంగారు పడ్డారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 6, 2025 / 10:40 PM IST

    Hero Vishal Health Problems

    Follow us on

    Hero Vishal : తెలుగు నాట మంచి క్రేజ్ ఉన్నటువంటి తమిళ హీరోలలో ఒకరు విశాల్ రెడ్డి. ఈయన తెలుగు వాడే అయినప్పటికీ తమిళనాడు లో స్థిరపడాల్సి వచ్చింది. ఇతని తండ్రి జీకే రెడ్డి ఒక ప్రముఖ నిర్మాత. అప్పట్లో మన స్టార్ హీరోలతో ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసాడు. ‘ప్రేమ చదరంగం’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన విశాల్ , ‘పందెం కోడి’ చిత్రం తో అటు తమిళం లోనూ, ఇటు తెలుగు లోనూ రీసౌండ్ వచ్చే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ చిత్రం విశాల్ కి మన టాలీవుడ్ లో తెచ్చిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఈయనకి మన టాలీవుడ్ మాస్ హీరో రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. పొగరు, భయ్యా, భరణి, పిస్తా, సెల్యూట్, పూజ, అభిమన్యుడు,మార్క్ ఆంటోనీ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో మన తెలుగు ఆడియన్స్ ని అలరించాడు విశాల్.

    ఈమధ్య కాలంలో విశాల్ కి సరైన సూపర్ హిట్ లేదు. చాలా కాలం తర్వాత వచ్చిన సూపర్ హిట్ ‘మార్క్ ఆంటోనీ’ కూడా ఆ చిత్రంలో విలన్ గా నటించిన ఎస్ జె సూర్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. అయితే రీసెంట్ గా ఈయన తీవ్రమైన అనారోగ్యం తో బాధపడుతున్నాడని వార్త రావడం తో అభిమానులు కంగారు పడ్డారు. రీసెంట్ గా ఆయన తాను గతం లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘మదగజరాజ’ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆ చిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాల్ కూడా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతున్న సమయం లో చేతులు వణుకుతున్న విషయాన్ని గమనించి అసలు విశాల్ కి ఏమైంది అంటూ అభిమానులు చర్చించుకున్నారు. గత కొద్దిరోజుల నుండి ఆయన తీవ్రమైన జ్వరం తో బాధపడుతున్నాడట.

    మనిషి కూడా ఒకప్పుడు దిట్టంగా ఉండేవాడు, ఇప్పడు గుండు చేయించుకొని సన్నగా మారిపోయి గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాడు. ఆయన ప్రస్తుత లుక్స్ ని చూసి ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయావు అంటూ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. తీవ్రమైన జ్వరం నుండి త్వరగా కోలుకొని సినిమాలు చేయాలని ఈ సందర్భంగా అభిమానులు ప్రార్థించారు. ప్రస్తుతం విశాల్ ‘డిటెక్టివ్ 2’ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రం లో ఆయన హీరో గా నటించడమే కాకుండా, దర్శకత్వ బాధ్యతలు కూడా తొలిసారి చేపట్టాడు. 2017 వ సంవత్సరం లో విడుదలైన ‘డిటెక్టివ్’ చిత్రం అటు తమిళం లోను, ఇటు తెలుగు లోను పెద్ద హిట్ అయ్యింది. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆండ్రియా జరేమియా, వినయ్ రాయ్ విలన్స్ గా నటించారు. అలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అవ్వడంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది.