యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి కోటి రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఆ మధ్య ఖాజాగూడకు చెందిన సింధూరారెడ్డి, అతని పై కేసు పెట్టింది. మరి ఆ తర్వాత ఈ కేసు ఏమైంది ? యాంకర్ శ్యామల భర్త అరెస్ట్, చీటింగ్ గట్రా అనగానే జనం కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించారు, ఈ వార్త కూడా బాగా వైరల్ అవడంతో మీడియా కూడా ఆ రెండు రోజులు బాగా హడావిడి చేసింది.
మరి, ఇప్పుడు ఆ కేసు ఏమైంది ? అసలు శ్యామల భర్త చీటింగ్ చేశాడా ? లేదా ? ఏ తప్పు చేయకపోతే.. శ్యామల భర్త నర్సింహారెడ్డి ఎందుకు మొహం చాటేస్తున్నాడు ? నా భర్త పై కేసు ఒక చీటింగ్ కేసు అంటూ శ్యామల తేల్చి చెప్పింది, కానీ అదెలా జరిగిందో ఆమె కూడా ఎందుకు చెప్పలేదు ? మొదటి నుండి ఈ కేసు పై శ్యామల వివరణ మరీ నాటకీయంగానే ఉంది.
నిజానికి జనానికి కూడా ఈ కేసు పై పలు అనుమానాలు రేకెత్తాయి. కానీ, ఆ తర్వాత ఈ కేసును పట్టించుకోవడం మానేశారు. ఇప్పటికే నెలలు గడిచిపోయాయి. మరి ఇప్పటికైనా ఈ కేసులోని నిజానిజాలు జనానికి తెలుస్తాయా ? మొదట అరెస్టైన నరసింహారెడ్డి చక్కగా బెయిల్ పై బయటకు వచ్చాడు. కేసు పెట్టిన మహిళ పరిస్థితి ఏమిటో తెలియదు.
నా పై చాల మోసపూరిత ఆరోపణలు వచ్చాయి, ఆ కథనాల పై నిజానిజాలు ఏమిటో మీతో పంచుకోవడానికి త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వచ్చి వివరణ ఇస్తాను అంటూ ఈ కేసు పెట్టిన రెండో రోజు మీడియా ముందుకు వచ్చి పెద్ద నిజాయితీ పరుడిలా మాట్లాడిన శ్యామల భర్త నర్సింహారెడ్డి ఇంతవరకు ఎందుకు మీడియా ముందుకు రాలేదు ? ఎందుకు ఇంతవరకు నిజానిజాలు చెప్పడం లేదు ? జనం అడుగుతున్న ఈ ప్రశ్నలకు, కనీసం పోలీసులు అయినా సమాధానాలు చెబుతారా ?
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: What happened to anchor shyamalas husband case
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com