Actor Abbas Helth: నటుడు అబ్బాస్ సడన్ గా ఆసుపత్రిలో ప్రత్యక్షమయ్యారు. ఐసీయూలో కఠిన పరిస్థితుల్లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రేమదేశం మూవీతో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు అబ్బాస్. 1996లో విడుదలైన ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ యువతను ఒప్పేసింది. మనసులు దోచే కథకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం తోడు కావడంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ మూవీతో వచ్చిన ఫేమ్ అబ్బాస్ కి తెలుగు, తమిళ భాషల్లో ఇమేజ్ తెచ్చిపెట్టింది. లవర్ బాయ్ గా అబ్బాస్ కొన్నాళ్ళు దూసుకుపోయాడు.

కానీ అబ్బాస్ కెరీర్ త్వరగా డౌన్ అయ్యింది. ఎలాంటి సప్పోర్ట్ లేకుండా పరిశ్రమకు వచ్చిన అబ్బాస్ కి మద్దతు లభించలేదు. దర్శక నిర్మాతలు ఆయన్ని సెకండ్ హీరో పాత్రలకు పరిమితం చేశారు. తెలుగు, తమిళ భాషల్లో సెకండ్ హీరో, సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ వచ్చాడు. కెరీర్లో అబ్బాస్ 50కి పైగా చిత్రాలు చేశారు. రెండు తమిళ సీరియల్స్ లో అబ్బాస్ నటించారు. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో 2015 తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
కాగా అబ్బాస్ ఇటీవల బైక్ ప్రమాదానికి గురయ్యారట. దాంతో ఆయన మోకాలికి తీవ్ర గాయమైందట. గాయం ఇబ్బందిపెడుతున్న తరుణంలో వైద్యులు సర్జరీ సూచించారట. దీంతో సర్జరీ కోసం అబ్బాస్ ఆసుపత్రిలో చేరారట. ఐసీయూలో ఆసుపత్రి బెడ్ పై ఉన్న అబ్బాస్ ఫోటో లీక్ కావడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూసిన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన క్షేమంగా ఉండాలి ప్రార్ధనలు చేస్తున్నారు.

మోకాలు సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరారని తెలిసిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. త్వరగా గాయం నయం కావాలని కోరుకుంటున్నారు. సినిమాలు మానేశాక ఆయన విదేశాల్లో సెటిల్ అయినట్లు సమాచారం. 1997లో అబ్బాస్ ఫ్యాషన్ డిజైనర్ ఇరుమ్ అలీని వివాహం చేసుకున్నారు. ఆమెతో పాటు అబ్బాస్ విదేశాల్లో ఉంటున్నారట.