Srikanth- Ooha: టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు శ్రీకాంత్ – ఊహా..పాతికేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట విడిపోబోతున్నారంటూ నిన్న సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం అయ్యింది..’అరెరే..ఒకరికోసం ఒకరు పుట్టారు అనిపించేంత అన్యోయంగా ఉండే ఈ జంట విడిపోతుందా..కనీసం పిల్లల కోసమైనా కలిసి ఉండొచ్చు కదా!’ అంటూ నెటిజెన్స్ బాధపడ్డారు కూడా..ఈ వార్త ఏకంగా ఎలక్ట్రానిక్ మీడియా కి కూడా ఎక్కి వైరల్ అవ్వడం తో హీరో శ్రీకాంత్ వెంటనే స్పందించాడు..ఇలాంటి పుకార్లు పుట్టించిన వారిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆయన మాట్లాడుతూ ‘ఇలాంటి చిల్లర పుకార్లను కొన్ని వెబ్ సైట్స్ మరియు యూట్యూబ్ చానెల్స్ ఎందుకు ప్రచారం చేస్తాయో తెలియట్లేదు..నా మీదనే కాదు చాలామంది సెలబ్రిటీస్ మీద కూడా ఇలాంటి ప్రచారాలు జరిగాయి..దయచేసి సైబర్ క్రైమ్ యాక్ట్ ద్వారా ఇలాంటి పుకార్లు పుట్టించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ ని కోరుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు హీరో శ్రీకాంత్.
స్టార్ హీరో గా ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న సమయం లోనే శ్రీకాంత్ తనతో కలిసి పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఊహా ని గ్రాండ్ గా పాతికేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు..వీళ్లిద్దరికీ ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కొడుకు ఉన్నాడు..కొడుకు రోహన్ ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమై తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని హీరోగా స్థిరపడిపోయాడు..నటనలో కానీ డాన్స్ లో కానీ తొలి సినిమాతోనే శబాష్ అనిపించుకున్నాడు.

‘ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది’ అని ప్రతి ప్రేక్షకుడి నోర్లలో బాగా నానాడు..కొడుకు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రీకాంత్ – ఊహా దంపతులకు ఇలాంటి పుకార్లు రావడం బాగా డిస్టర్బ్ చేసినట్టు ఉంది..గతం లో కూడా సుమ మరియు రాజీవ్ కనకాల విషయం లో కూడా ఇలాంటి పుకార్లు బాగా ప్రచారమయ్యాయి..వీళ్లిద్దరు దీనిపై అది పుకారు మాత్రమే అని క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..ఇప్పుడు శ్రీకాంత్ – ఊహ విషయం లో కూడా అదే జరిగింది..ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ ఉండే శ్రీకాంత్ వెంటనే రెస్పాస్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది..లేకపోతే ఈ పుకారు మరో నెల రోజుల పాటు సోషల్ మీడియా లో తిరుగుతూనే ఉండేది.