https://oktelugu.com/

థియేటర్లతో ఏమి రాదుగా, అందుకే ఈ నిబంధనలు ?

కరోనా మహమ్మారి ప్రస్తుతానికి తన ప్రభావాన్ని రోజురోజుకు తగ్గించుకుంటూ పోతూ ఉంది. దాంతో ప్రజలు మళ్లీ బతుకు పై ఆశతో తమ జీవిత ప్రయాణాన్ని కష్టంగా నైనా ముందుకు తీసుకువెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా చిన్నగా లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తూ అన్ని రంగాల వారికీ అనుమతులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా థియేటర్లు తెరిచేందుకు తాజాగా అనుమతిచ్చింది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా మూడు నెలలుగా థియేటర్లను మూసివేయడంతో సినిమా రంగం […]

Written By:
  • admin
  • , Updated On : July 5, 2021 / 04:07 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారి ప్రస్తుతానికి తన ప్రభావాన్ని రోజురోజుకు తగ్గించుకుంటూ పోతూ ఉంది. దాంతో ప్రజలు మళ్లీ బతుకు పై ఆశతో తమ జీవిత ప్రయాణాన్ని కష్టంగా నైనా ముందుకు తీసుకువెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా చిన్నగా లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తూ అన్ని రంగాల వారికీ అనుమతులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా థియేటర్లు తెరిచేందుకు తాజాగా అనుమతిచ్చింది.

    కరోనా సెకెండ్ వేవ్ కారణంగా మూడు నెలలుగా థియేటర్లను మూసివేయడంతో సినిమా రంగం అండ్ థియేటర్ల పై ఆధారపడుతున్న లక్షల మంది నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం థియేటర్ల పై ఆంక్షలను సడలించే సరికి సినిమా వాళ్ళలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పటికిప్పుడు సినిమాలను రిలీజ్ చేయకపోయినా వచ్చే నెలలో వరుసగా రిలీజ్ చేయనున్నారు.

    మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఐతే, సీటుకు, సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా చూడాలని జగన్ ప్రభుత్వం కఠిన నిబంధన పెట్టింది. మరి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ను నడిపితే ఎంతవరకు గిట్టుబాటు అవుతుంది అనేది మిలియన్ల డాలర్ల ప్రశ్నయే.

    ఇక తెలంగాణలో ఇప్పటికే థియేటర్లు తేర్చేందుకు అనుమతి ఇచ్చారు. పైగా తెలంగాణలో ఆక్యుపెన్సీ విషయంలో ఎటువంటి ఆంక్షలు లేకపోవడం విశేషం. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం థియేటర్ల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. అదే బెల్ట్ షాప్ ల విషయంలో అయితే, ఎలాంటి కండిషన్ లు లేకుండా విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చింది. ఎంతైనా థియేటర్ల నుండి ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి వచ్చేది ఏమిలేదు కదా, అందుకే ఈ నిబంధనలు.