Bigg Boss 5 Shanmukh and Siri: బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నటుడు వీజే సన్నీ అవతరించాడు. హౌస్ లో సన్నీ తన గేమ్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. సన్నీ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడం తో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. విన్నర్ గా టైటిల్ తో పాటు ప్రైజ్ మనీ, రెమ్యూనరేషన్, ఫ్లాట్, బైక్ ఇలా మొత్తం కోటి రూపాయల వరకు సన్నీ షో కారణంగా దక్కించుకున్నారు.

హౌస్ నుండి బయటికి వచ్చాక సన్నీకి అసలు తీరిక లేదు. ఫ్యాన్స్, సన్నిహితులతో బిజీగా గడుపుతున్నారు. 105 రోజులు హౌస్ లో ఉండగా.. స్వేచ్ఛా ప్రపంచంలో విహరిస్తున్నారు. అదే సమయంలో సన్నీ పలు మీడియా సంస్థల ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఆయన ఫేమ్ రీత్యా సన్నీ అప్పాయింట్మెంట్ కోసం ఛానల్స్ ఎగబడుతున్నాయి. అడిగిన వారిని కాదనకుండా వరుసగా ఇంటర్వ్యూలలో సన్నీ పార్టిసిపేట్ చేస్తున్నారు.
అయితే ఈ ఇంటర్వ్యూలతో సన్నీకి ఓ చిక్కు వచ్చి పడింది. ప్రతి కార్యక్రమంలో సన్నీకి కామన్ గా ఒక ప్రశ్న ఎదురవుతుందట. హౌస్ లో సిరి, షణ్ముఖ్ రిలేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. వారిద్దరూ స్నేహితులమని చెప్పుకుంటూ.. నాన్ స్టాప్ రొమాన్స్ పంచారు. మితిమీరిన హగ్గులు, ఒకే బెడ్ పై పడుకుంటూ హద్దులు దాటి ప్రవర్తించారు. హౌస్ లో వారితో మూడు నెలలు ఉన్నవాడిగా, సిరి-షణ్ముఖ్ ని దగ్గరగా చూసిన వాడిగా.. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి? అని అడుగుతున్నారట.
Also Read: BiggBoss5 Telugu: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఎవరికి ఎక్కువంటే?
హౌస్ లో సిరి, షణ్ముఖ్ ఎలా ఉండేవారు? నిజంగా వారు స్నేహితులేనా? ఇంకేమైనా ఉందా? అని సన్నీని విసిగిస్తున్నారట. ఎన్నిసార్లు అడిగినా సహనంగా సన్నీ వారు కేవలం స్నేహితులు మాత్రమే అంటూ సమాధానం చెబుతున్నారట. అయితే సన్నీ చెప్పినా వాళ్ళు మాత్రం నమ్మడం లేదట.
హౌస్ లో సిరి, షణ్ముఖ్.. సన్నీకి బద్ద శత్రువులు గా మెలిగారు. అయినప్పటికీ సన్నీ వాళ్ళ రిలేషన్ గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. టైటిల్ గెలిచిన అనంతరం సన్నీ రన్నర్ షణ్ముఖ్ పై ప్రశంసలు కురిపించాడు. హౌస్ లో ఉన్న మోస్ట్ కూలెస్ట్ పర్సన్ అన్నాడు. అలాగే సిరి, షణ్ముఖ్ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, నేను మానస్ వలే, అని చెప్పి రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.