Acharya Movie: ఆచార్య సినిమా చిరు అభిమానులకు నిరాశే మిగిలచ్చింది. చిరంజీవి కూడా సినిమా అపజయంతో కుంగిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య అంచనాలు తలకిందులు చేసింది. దర్శకుడు కొరటాల శివ ప్రతిభను నమ్మి కథ మీద శ్రద్ధ చూపకుండా గుడ్డిగా ముందుకెళ్లడమే మోసం చేసిందనే వాదనలు వస్తున్నాయి. ఆచార్య సినిమా పరిశ్రమనే ఆందోళనకు గురి చేసింది. ఎంతో మంది సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా వాటిని వమ్ము చేసింది. కనీసం పెట్టుబడి కూడా రాకుండా చేసింది.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అంటారు. ఆచార్య అపజయానికి కూడా అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు మణిశర్మ సంగీతం మైనస్ అయిందనే వాదన వచ్చింది. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న థమన్ ను కాకుండా మణిశర్మను తీసుకోవడంతోనే సినిమా అపజయం పాలైందని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించే సంగీతం గతి తప్పిందని తెలుస్తోంది. అందుకే సినిమా పరాజయం చెందిందనే అభిమానులు నమ్ముతున్నారు.
Also Read: Chiranjeevi Missed Basha Movie: బాషా సినిమాని చిరంజీవి మిస్ అవ్వడానికి కారణం ఎవ్వరో తెలుసా..?
దర్శకుడు కొరటాల శివ టాలెంట్ పై ఉన్న నమ్మకంతోనే చిరంజీవి ముందుకు వెళ్లారు. రాంచరణ్ కూడా ఓ పాత్ర చేయడంతో సినిమా విజయం ఖాయమని అందరు భావించారు. కానీ వారి ఆశలు అడియాశలే అయ్యాయి. చిరంజీవి నమ్మకం కాస్త వమ్ము అయింది. సినిమా అట్టర్ ప్లాఫ్ కావడంతో తల ఎత్తుకోలేని పరిస్థితి. ఎంతో ఊహించుకున్న సినిమా ఒక్క దెబ్బకు కుప్పకూలడం నిజంగానే అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో నటులు కూడా పారితోషికం తీసుకునేందుకు వెనకాడినట్లు సమాచారం.
ఇక రాబోయే సినిమాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని చిరంజీవి చూస్తున్నారు. నష్టాల బారిన పడితే చివరకు అందరికి కష్టమే. అందుకే అలాంటి తప్పులు జరగకుండా చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే సినిమాల్లో తప్పులు దొర్లకుండా కథ, కథనంలో మరింత అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో దర్శకుల ప్రతిభ కాకుండా అన్ని విషయాలు లెక్కలోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఆచార్య మిగిల్చిన నష్టంతో కోలుకోలేకుండా ఉన్నట్లు తెలుస్తోంది.

మరో విషయం ఇక్కడ ప్రస్తావిస్తే అ తో మొదలయ్యే సినిమాలు అన్ని అపజయం అయినట్లు చెబుతున్నారు. అందుకే ఆచార్య కూడా అదే బాటలో నడిచిందని విశ్వసిస్తున్నారు. ఆడవాళ్లకు మాత్రమే, ఆలయశిఖరం, ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు చిరంజీవికి చేదు అనుభవమే మిగిల్చాయి. అదే కోవలో ఆచార్య కూడా ఉందని చెబుతున్నారు. కానీ ఇవేవీ కావని కొందరు వాదిస్తున్నారు. మోచేతిలో బలముంటే మొండి కొడవలి కూడా తెగుతుందన్నట్లు కథలో బలముంటే విజయం అదే వస్తుందని కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి రాబోయే సినిమాల్లో చిరంజీవి ఏ జాగ్రత్తలు తీసుకోనున్నారో తెలియడం లేదు.
Also Read:Mahesh Babu-Trivikram: ‘మహేష్ – త్రివిక్రమ్’ సినిమాకి అదిరిపోయే టైటిల్.. మళ్లీ అదే టైటిల్ ?
[…] Also Read: Acharya Disaster: ఆచార్య అపజయానికి కారణాలేంటి? […]
[…] Also Read: Acharya Disaster: ఆచార్య అపజయానికి కారణాలేంటి? […]