Adipurush Trailer: ‘ఆదిపురుష్’ రామాయణంలో ఈ చిత్రవిచిత్ర జంతువులు ఏంటి?

చూస్తునంత సేపు మనం రామాయణ గాధలోకి అడుగుపెట్టామా అనే అనుభూతి ప్రతీ ఒక్కరిలో కలిగింది. కేవలం ట్రైలర్ కి ఇలాంటి అద్భుతమైన అనుభూతి కలిగితే ఇక సినిమాకి ఆడియన్స్ ఏమైపోతారో చూడాలి.

Written By: Vicky, Updated On : May 9, 2023 4:12 pm

Adipurush Trailer

Follow us on

Adipurush Trailer: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదల చేసారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కదా మేము కోరుకున్న గ్రాఫిక్స్ అంటే, ఇది కదా మేము కోరుకున్న ఔట్పుట్ అంటే అని ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు ఈ ట్రైలర్ ని చూసి.

చూస్తునంత సేపు మనం రామాయణ గాధలోకి అడుగుపెట్టామా అనే అనుభూతి ప్రతీ ఒక్కరిలో కలిగింది. కేవలం ట్రైలర్ కి ఇలాంటి అద్భుతమైన అనుభూతి కలిగితే ఇక సినిమాకి ఆడియన్స్ ఏమైపోతారో చూడాలి. ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత అనిపించింది ఏమిటంటే ప్రభాస్ లుక్స్ ఇంకా కొంచెం బాగా ఉంది ఉంటే బాగుండేది అని అనిపించింది. అంతే కాకుండా ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఆశించిన స్థాయిలో లేదు.

ఇది ఇలా ఉండగా ఈ ట్రైలర్ లో మనం వానరసైన్యాన్ని చూడవచ్చు. పెద్ద పెద్ద కింగ్ కాంగ్ లతో పాటుగా, విచిత్రమైన జంతువులూ మరియు పక్షులను కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. లంకకి చేరుకోవడం కోసం అప్పట్లో శ్రీరాముడికి వానరసైన్యం సహాయం చేసింది అనే విషయం అందరికీ తెలుసు కానీ, ఈ విచిత్రమైన జంతువులూ ఎక్కడి నుండి వచ్చాయి..?, వీటి కథ ఏమిటి అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

అయితే లంకకి వెళ్లేందుకు వానర సైన్యం నిర్మిస్తున్న రామ సేతు వంతెన కి కేవలం వానరాలు మాత్రమే కాదు, చిన్న చిన్నఉడతలు కూడా తమ వంతు సహాయం గా రాళ్లను తెచ్చి ఇచ్చాయి, అలా ఎన్నో జీవాలు రాముడి ని సీతని కలిపేందుకు సహాయపడ్డాయి. డైరెక్టర్ ఈ చిత్రం ద్వారా అదే చూపించాలనుకున్నాడు, ఇంకా రామాయణం ని ఆయన ఎంత డిటైలింగ్ గా చూపించాడో తెలియాలంటే జూన్ 16 వరకు ఆగాల్సిందే.