Bigg Boss Couples : బిగ్ బాస్ హౌస్లో ప్రేమకథలు చాలా కామన్. నాలుగు గోడల మధ్య కలిసి ఉండే క్రమంలో యువతీ యువకుల మధ్య ప్రేమ చిగురించడం ఖాయం. గంటల తరబడి మాట్లాడుకోవడం వలన మనుషులు మానసికంగా దగ్గరవుతారు. తెలుగులో బిగ్ బాస్ షో 2017లో ప్రారంభం అయ్యింది. 8వ సీజన్ కూడా పూర్తి కావచ్చింది. ఈ ఎనిమిది సీజన్స్ లో ప్రేమికులుగా మారిన కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి వారిప్పుడు కలిసే ఉన్నారా..?
చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో మొదటిసారి లవ్ బర్డ్స్ అనే బ్రాండ్ నేమ్ తెచ్చుకున్నవారు పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో వీరు కంటెస్ట్ చేశారు. టాప్ సెలెబ్స్ పాల్గొన్న ఈ సీజన్లో వీరి మీద పెద్దగా అంచనాలు లేవు. కానీ ఒక లవ్ ట్రాక్ నడిపి పాప్యులర్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ ఏకంగా టైటిల్ విన్నర్ అయ్యాడు. షో ముగిశాక కొన్నిరోజులు వీరు సన్నిహితంగా ఉన్నారు. పై చదువుల కోసం పునర్నవి లండన్ వెళ్ళిపోయింది. సీజన్ 8లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది.
సీజన్ 4లో రెండు ప్రేమజంటలు ఉన్నాయి. నిఖిల్ సార్థక్-మోనాల్, హారిక-అభిజీత్. మొదట్లో మోనాల్ కి అభిజీత్ కూడా ట్రై చేశాడు. ఆమె నిఖిల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఇక తనను బాగా ఇష్టపడుతున్న హారికను అభిజీత్ అంగీకరించాడు. అభిజీత్ టైటిల్ విన్నర్ అయ్యాడు బయటకు వచ్చాక హారిక నాకు చెల్లితో సమానం అని చెప్పి ఆమెకు షాక్ ఇచ్చాడు.హారిక సినిమాలు సిరీస్లు చేసుకునే పనిలో ఉంది. అభిజీత్ ఇండస్ట్రీని కూడా వదిలేసి ట్రావెలర్ గా మారిపోయాడు.
అఖిల్, మోనాల్ కూడా ఎవరి దారి వారు చూసుకున్నారు. తమకు లవర్స్ ఉన్నప్పటికీ షణ్ముఖ్, సిరి హన్మంత్ ప్రేమికులుగా మారారు. సీజన్ 5కి వీరి రొమాంటిక్ ట్రాక్ హైలెట్. ఇది నచ్చని దీప్తి సునైన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. తప్పు ఒప్పుకున్న సిరిని శ్రీహాన్ క్షమించి దగ్గరకు తీసుకున్నాడు. వారిద్దరూ కలిసి ఉన్నారు. సీజన్ 6లో ఇనాయ సుల్తానా-ఆర్జే సూర్య సీరియస్ లవ్ ట్రాక్ నడిపారు. కానీ వీరు కూడా హౌస్ నుండి బయటకు వచ్చాక రిలేషన్ కొనసాగించలేదు.
ఇక లేటెస్ట్ సీజన్లో విష్ణుప్రియ-పృథ్వి రొమాన్స్ చేశారు. పృథ్వి ఎలిమినేట్ అయ్యాడు. విష్ణుప్రియ ఆదివారం ఎలిమినేట్ కానుందట. పృథ్వి అంటే హౌస్లో పిచ్చ ప్రేమ చూపించిన విష్ణుప్రియ బయటకు వచ్చాక అతనితో రిలేషన్ నడుపుతుందా లేదా అనేది చూడాలి.
Web Title: What are these couples who fell in love in the bigg boss house doing now
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com