Prabhas Trivikram combo missed movies: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు వరుస సినిమాలను చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాన్ పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో తన రేంజ్ మారిపోయింది… దాదాపు పది సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం తను నెంబర్ వన్ హీరోగా కొనసాగుతుండటం విశేషం…ఖాన్ త్రయంగా చెప్పుకునే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లు సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించడం లేదు.
దాంతో ప్రభాస్ వైపే ప్రతి ఒక్కరి చూపైతే ఉంది. బాలీవుడ్ ప్రేక్షకులైతే ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఈగరుగా ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్లతో సినిమాలను చేశాడు. కానీ త్రివిక్రమ్ తో మాత్రం ఇప్పటివరకు తను ఒక్క సినిమాను కూడా చేయలేదు.
కారణం ఏంటంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒకటి రెండు సినిమాలు చేయాలనుకున్నప్పటికి అవి కార్య రూపమైతే దాల్చలేదు. అల్లు అర్జున్ చేసిన ‘జులాయి’ సినిమాని మొదట ప్రభాస్ తో చేయాలని అనుకున్నారట. కానీ అనుకొని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు అయితే వాళ్ళిద్దరి మధ్య వర్కౌట్ కాలేదు. దాంతో అల్లు అర్జున్ తో ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు.
ఇక ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో సినిమా చేయాలని అనుకున్నప్పటికి తను ఏదో ఒక సినిమాలో బిజీగా ఉండడం వల్ల వీళ్ళ కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇక ఫ్యూచర్లో ఒక భారీ బడ్జెట్ తో సినిమా రూపొందే అవకాశాలైతే ఉన్నాయంటూ త్రివిక్రమ్ సన్నిహితుల దగ్గర నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. త్రివిక్రమ్ సైతం ప్రభాస్ కటౌట్ కి సరిపడా ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథని రెడీ చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది…