https://oktelugu.com/

Saindhav: సైంధవ్ ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటి?

ఇప్పటి వరకు కూడా ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు ఈ స్టార్ హీరో. అందుకే రానానాయుడు వెబ్ సిరీస్ తో వెంకీ విమర్శల పాలయ్యారు. ఇలాంటి వెబ్ సిరీస్ లు వెంకటేష్ నటించడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన అభిమానులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 5, 2024 / 03:50 PM IST

    Saindhav

    Follow us on

    Saindhav: సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈయన సినిమాలు కచ్చితంగా ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు అనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు విక్టరీ వెంకటేష్. ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ హీరో ఇప్పటికీ తన హవా కొనసాగిస్తున్నారు.

    ఇప్పటి వరకు కూడా ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు ఈ స్టార్ హీరో. అందుకే రానానాయుడు వెబ్ సిరీస్ తో వెంకీ విమర్శల పాలయ్యారు. ఇలాంటి వెబ్ సిరీస్ లు వెంకటేష్ నటించడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన అభిమానులు. ఇదిలా ఉంటే రీసెంట్ గా సైంధవ్ సినిమాలో నటించారు వెంకీ. శైలేను కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. దీంతో సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

    ఇంతకముందు డైరెక్టర్ శైలేష్ కొలను హిట్, హిట్ 2 సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. కానీ సైంధవ్ సినిమాతో భారీ ఫ్లాప్ ను చవి చూశారు. అయితే దీనికి కారణం స్ట్రిప్ట్ లో తేడా అంటారు కొందరు. స్క్రిప్ట్ లో కొంచెం మార్పులు చేర్పులు చేసి ఉంటే సినిమా తప్పకుండా సూపర్ హిట్ ను సొంతం చేసుకునేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా హిట్ కాదని అనుకున్నారట వెంకటేష్.

    రిలీజ్ కంటే ముందు సినిమా ప్రమోషన్స్ చేయకపోతే కనీసం ఓపెనింగ్స్ కూడా రావనే ఉద్దశ్యంతో తను ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాకు హైప్ ను తీసుకొచ్చాడు అని టాక్. అయితే వెంకటేష్ ముందే సినిమాలో కొన్ని సీన్స్ చేంజ్ చేద్దామని చెప్పారట. కానీ డైరెక్టర్ వినలేదట. దీనివల్లనే సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది అనే టాక్ వచ్చింది. ఏది ఏమైనా వెంకీ మామకు ఈ మధ్య హిట్ లేదనే చెప్పాలి.